2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్‌–రా | Economy to grow at 7.4% next fiscal: Ind-Ra | Sakshi
Sakshi News home page

2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్‌–రా

Feb 15 2017 1:26 AM | Updated on Sep 5 2017 3:43 AM

2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్‌–రా

2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్‌–రా

భారత్‌ ఆర్థికవృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.4 శాతంగా నమోదవుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌–రా) మంగళవారం పేర్కొంది.

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థికవృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.4 శాతంగా నమోదవుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌–రా) మంగళవారం పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మాత్రం 7.9 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర గణాంకాల విభాగం అంచనా 7.1 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. వినియోగ డిమాండ్, ప్రభుత్వ వ్యయాల పెంపు వంటి కారణాల వల్ల వచ్చే ఏడాది వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలో వృద్ధిరేటు వరుసగా 3%, 6.1%, 9.1%గా నమోదవుతాయన్న అంచనాలను వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement