యుద్ధ ముగింపు ఆశలతో పరుగులు
100 డాలర్ల దిగువకు క్రూడాయిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు
దాదాపు 2% ర్యాలీ చేసిన సూచీలు
రూ. 9.60 లక్షల కోట్ల సంపద సృష్టి
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని(2026–27) దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో మొదలుపెట్టింది. పశ్చిమాసియా యుద్ధం 2–3 వారాల్లో ముగిస్తుందనే ఆశలు సూచీలను పరుగులు పెట్టించాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చిది. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,187 పాయింట్లు పెరిగి 73,134 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 348 పాయింట్లు బలపడి 22,679 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,017 పాయింట్లు ఎగసి 73,964 వద్ద, నిఫ్టీ 610 పాయింట్లు బలపడి 22,941 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా సూచీల లాభాలు సగానికి తుడిపెట్టుకుపోయాయి. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ. 422.01 లక్షల కోట్లకు చేరింది.
→ ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 8%, జపాన్ 5%, తైవాన్ 4% ర్యాలీ చేశాయి. ఇండోనేíÙయా, హాంగ్‌కాంగ్, సింగపూర్ 2%, చైనా, థాయ్‌లాండ్ 1.55% పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1.5% – 2% లాభపడ్డాయి. అమెరికా స్టాక్ సూచీలు 1% లాభంతో ట్రేడవుతున్నాయి.
→ ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. రంగాల వారీ ఇండెక్సుల్లో సరీ్వసెస్ 5%, పీఎస్‌యూ బ్యాంక్ 3.66%, ఇండ్రస్టియల్స్ 3.40%, క్యాపిటల్ గూడ్స్ 3.29%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.79%, కమోడిటీస్ 2.72%, ఐటీ 2.40% పెరిగాయి. సెన్సెక్స్‌లో ఎన్‌టీపీసీ (–1.64%), సన్‌ఫార్మా (–1.64%), పవర్‌గ్రిడ్ (–1.13%), అ్రల్టాటెక్ (–0.29%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి.
బుల్ పరుగులు ఎందుకంటే ..
ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరాన్ యుద్ధాన్ని 2–3 వారాల్లో ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగవని హామీ ఇస్తే యుద్ధం ముగింపునకు సిద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. దీంతో భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 4% క్షీణించి 100 డాలర్ల దిగువకు దిగివచ్చాయి. మూడునెలల గరిష్టానికి చేరిన అమెరికన్ బాండ్లపై రాబడులు అనూహ్యంగా దిగివచ్చాయి. దలాల్ స్ట్రీట్ మార్చిలో 11% భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి.
→ జెట్ ఫ్యూయెల్ ధరలు పరిమితంగానే పెరగడంతో ఏవియేషన్ రంగానికి చెందిన ఇండిగో షేరు 6%, స్పైస్‌జెట్ 2% పెరిగాయి.


