మిడ్‌క్యాప్‌లో లాభాల కోసం... | DSP Mid Cap Funds For Profists | Sakshi
Sakshi News home page

మిడ్‌క్యాప్‌లో లాభాల కోసం...

Jun 24 2019 10:41 AM | Updated on Jun 24 2019 10:41 AM

DSP Mid Cap Funds For Profists - Sakshi

బాగా చౌక విలువల వద్ద అందుబాటులో ఉన్న మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు ఆశించాలనుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో డీఎస్‌పీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఒకటి. మోస్తరు రిస్క్‌ తీసుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.  

రాబడులు
ఈ పథకం దీర్ఘకాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీకి మించి రాబడులను ఇచ్చింది. ఏడాది కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100లో నికర నష్టాలు 6.3 శాతంగా ఉంటే, ఈ పథకం నష్టాలను 4.9 శాతానికే పరిమితం చేసింది. మూడేళ్ల కాలంలో డీఎస్‌పీ మిడ్‌క్యాప్‌ పథకం వార్షికంగా 13.6 శాతం, ఐదేళ్లలో 16.4 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 రాబడులు ఇవే కాలాల్లో 11.8 శాతం, 13.1 శాతంగానే ఉన్నాయి. దీర్ఘకాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ కంటే ఈ పథకం 4 శాతం మేర అదనపు రాబడులను ఇచ్చినట్టు పనితీరు చూస్తే తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఈ పథకం అగ్రస్థాయి జాబితాలో ఉంది. కనీసం 7–10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసే వారు, సిప్‌ మార్గంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. 

పోర్ట్‌ఫోలియో, విధానం
డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో, ఒకే స్టాక్‌కు భారీగా పెట్టుబడులు కేటాయించకపోవడం తదితర విధానాలను ఈ పథకం అనుసరిస్తోంది. పైగా అస్థిరతలు పెరిగిపోయిన సమయాల్లో నగదు, డెట్‌కు పెట్టుబడులు పెంచుకోవడం ద్వారా రిస్క్‌ తగ్గించే ప్రయత్నం చేస్తుంటుంది. వీటికి తోడు భారీగా విలువ దాగి ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడుల వల్ల అధిక రాబడులను ఇవ్వగలిగిందని చెప్పుకోవచ్చు. ఈ పథకం సాధారణంగా 50 నుంచి 65 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటుంది. విడిగా ఒక కంపెనీలో పెట్టుబడులను 5 శాతాన్ని మించనీయదు. ఈక్విటీ మార్కెట్‌ అస్థిరతల సమయాల్లో నగదు, డెట్‌ విభాగాల్లో పెట్టుబడులను 8–10 శాతానికి పెంచుకుంటుంది. అలాగే, ఆటుపోట్ల సమయాల్లో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 10–15 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేస్తుంది. అందుకే ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ మోస్తరుగా ఉంటుంది. మార్కెట్‌ పతనాల్లో భారీ నష్టాలు రాకుండా, అవి మోస్తరుగానే ఉంటాయని ఆశించొచ్చు. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌కు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగ స్టాక్స్‌లోనే 17.58 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత కెమికల్స్‌ స్టాక్స్‌లో 15.48 శాతం, హెల్త్‌కేర్‌లో 11 శాతం, ఇంజనీరింగ్‌లో 10.41 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. ఈ పథకం మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆయా రంగాల వారీ ఎక్స్‌పోజర్‌లో మార్పులు, చేర్పులు కూడా చేస్తుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌లో అధిక నాణ్యతతో కూడిన మధ్య స్థాయి బ్యాంకులు ఆర్‌బీఎల్‌ బ్యాంకు, సిటీ యూనియన్‌ బ్యాంకుల్లో ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. ముఖ్యంగా గత ఏడాది కాలంలో బాగా తక్కువకు పడిపోయిన ఫార్మా, ఇండస్ట్రియల్‌ ప్రొడక్ట్స్‌లో ఎక్స్‌పోజర్‌ను పెంచుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement