నిపుణుల కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం

నిపుణుల కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగానికి అవసరమైన వృత్తి నిపుణులను తీర్చిదిద్దడానికి లైఫ్ సెన్సైస్ సెక్టర్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ), విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (వీఊపీఈఆర్)లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఫార్యాస్యూటికల్, బయోటెక్నాలజీ, క్లీనికల్ రీసెర్చ్ రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. దీంతో దేశ ఆర్థిక జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న ఫార్మారంగానికి నిపుణుల కొరత తీరుతుందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top