డాలర్‌కు ఫెడ్‌ ఆందోళన సెగ | Sakshi
Sakshi News home page

డాలర్‌కు ఫెడ్‌ ఆందోళన సెగ

Published Thu, Nov 23 2017 10:16 AM

Dollar sinks on Fed inflation fears, weak data - Sakshi

న్యూయార్క్‌:  అమెరికా కరెన్సీ డాలర్‌కు ఫెడ్‌ షాక్‌ తగిలింది.  ప్రధాన కరెన్సీలతో పోలిస్తే  డాలర్ బుధవారం పడిపోయింది.  అమెరికా డేటా, ద్రవ్యోల్బణంపై విధాన నిర్ణేతలు ఆందోళన  నేపథ్యంలో డాలర్‌ ఐదు నెలల్లో చెత్త వన్డే ప్రదర్శనను నమోదు చేసింది. దీంతో దేశీయ కరెన్సీ లాభాలతో ప్రారంభమైంది.డాలర్‌ మారకంలోమ రూపీ 0.06పైసల లాభంతో 64.83 వద్ద కొనసాగుతోంది. అటు యూరోకూడా డాలర్‌ మారకరంలో అయిదురోజుల గరిష్టానికి చేరింది.

ఫెడరల్ రిజర్వు  ఇటీవలి విధాన సమావేశం మినిట్స్‌విడుదల,  బలహీనమైన అమెరికా  డేటా,   టెక్నికల్‌ ట్రేడింగ్‌ కారణాల రీత్యా బుధవారం ఇతర కరెన్సీలతోపోలిస్తే  అక్టోబర్‌ నెలలో కనిష్టస్థాయికి పడిపోయింది. అలాగే గత ఐదునెలల్లో ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అటు మిచిగాన్ యూనివర్సిటీవినియోగదారుల సెంటిమెంట్ రిపోర్ట్ కూడా దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం క్షీణిస్తుందని అంచనా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement