ఎల్‌ఐసీ ఐపీఓ... తొలి అడుగు | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఐపీఓ... తొలి అడుగు

Published Sat, Jun 20 2020 5:44 AM

DIPAM invites bids from transaction advisors for LIC IPO - Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించి తొలి అడుగు పడింది. ఐపీఓ  విధి విధానాలకు సంబంధించి  సేవలందించే వివిధ  సంస్థల నుంచి  దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. దేశంలోనే అతి పెద్ద ఐపీఓ కానున్న ఈ ఎల్‌ఐసీ ఐపీఓ కసరత్తు కోసం కనీసం రెండు సలహా సంస్థలను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు/మర్చంట్‌ బ్యాంకర్లు/ఆర్థిక సంస్థలు /బ్యంక్‌ల నుంచి దరఖాస్తులను దీపమ్‌(డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌) ఆహ్వానించింది. వచ్చే నెల 13లోపు సంస్థలు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జూలై 14న బిడ్‌లు తెరుస్తారు. ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో ఉండొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

Advertisement

తప్పక చదవండి

Advertisement