ఇదేం వింత.. హెడ్‌ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే..?

Dialed Online Shopping Giant, Got An SMS To Join The BJP Instead - Sakshi

కోలకతా: ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో మోసానికి సంబంధించి మరో షాకింగ్‌ ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఆర్డర్‌ చేసినపుడు సదరు వస్తువులకు బదులుగా రాళ్లు, రప్పలు, మరేదో రావడం చూశాం. కానీ కోలకతాకు చెందిన వినియోగదారుడికి మాత్రం మరో వింత అనుభవం ఎదురైంది. ఒక ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీకి హెడ్‌ఫోన్స్‌ కోసం ఆర్డర్‌ చేసిన కస్టమర్‌ అనంతరం పరిణామాలకు గందరగోళంలో పడిపోయాడు.

ఫుట్‌బాల్‌ పట్ల అమితమైన ప్రేమ​ ఉన్న ఓ అభిమాని అటు కుటుంబానికి, ఇటు తనకు ఏఇబ్బందీ లేకుండా మ్యాచ్‌లనుఎంజాయ్‌ చేయాలనుకున్నాడు. ఇందుకు రెండుటీవీ హెడ్‌సెట్‌లను ప్రముఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఆర్డర్‌ చేశాడు.  ఈ ప్యాకేజీ శుక్రవారం ఇంటికి చేరింది.  అయితే ఆ సమయానికి ఇంట్లో  లేకపోవడంతో అతడు శనివారం ఆ ప్యాక్‌ విప్పి చూశాడు. ఎంతో ఆసక్తిగా తన హెడ్‌ఫోన్‌కోసం ఎదురు చూసిన అతగాడు బాక్స్‌లో ఉన్నది చూసి బిత్తరపోయాడు. ఇక్కడే ఈయనకు మరో షాక్‌ తగిలింది.  హెడ్‌ఫోన్‌కు బమదులుగా ఒక  హెయిర్‌ ఆయిల్‌ డబ్బా దర్శనమిచ్చింది.  దీంతో బాధితుడు బాక్స్‌మీద ఉన్న టోల్‌ ఫ్రీకి (1800) ఫోన్‌  చేశాడు. ఫోన్‌ రింగ్‌ ఒకసారి మ్రోగి.. డిస్‌ కనెక్ట్‌ అయింది. ఆ వెంటనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం అన్న సందేశం వచ్చింది. అయోమయంలోంచి తేరుకోకుండానే బాధితుడు అదే నెంబర్‌కు మళ్లీ డయల్‌ చేశాడు. సేమ్‌ ఎస్‌ఎంఎస్‌ రిపీట్‌. ఇక ఈ విషయాన్ని వాళ్ల  స్నేహితులతో షేర్‌ చేస్తే.. వాళ్లు ఇదే అనుభవాన్ని  పంచుకున్నారు.  అయితే వారి సలహా మేరకు కంపెనీకి చెందిన  అసలైన టోల్‌ ఫ్రీ నెంబరు తెలుసుకుని తన  ఫిర్యాదు నమోదు చేశాడు.

ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే..ఆయిల్‌ కావాలంటే వాడుకోండి..లేదంటే అవతల పారేయండి. దురదృష్టవశాత్తూ మా దగ్గర హెడ్‌ఫోన్‌ సెట్‌ ఒకటి మాత్రమే ఉంది. రెండో దానికి డబ్బులు వాపస్‌ చేస్తామంటూ    సోమవారం ఉదయం షాపింగ్ పోర్టల్ నుండి కాల్‌ రావడం.  దీంతో ఈ మొత్తం వ్యవహారంతో తెల్లబోయిన బాధితుడు మాత్రం మళ్లీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వాళ్లు వచ్చి ఆదే బాటిల్‌ వాపస్‌ ఇవ్వమంటే ఎలా అనుకుంటూ.. నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి... ఫుల్‌బాల్‌ మ్యాచ్‌లను మ్యూట్‌లోనే వీక్షిస్తున్నాడుట.

మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి  ..అసలు 1800నెంబరు తమకు చెందినది కాదనీ.. మోసగాళ్ల వలలో పడి విలువైన సమాచారాన్ని షేర్‌  చేయొద్దంటూ కోరారు. అలాగే అంశాన్ని తమ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top