డీహెచ్‌ఎఫ్‌ఎల్ అంబాసిడర్ షారూక్ | DHFL signs Shah Rukh Khan as brand ambassador | Sakshi
Sakshi News home page

డీహెచ్‌ఎఫ్‌ఎల్ అంబాసిడర్ షారూక్

Nov 25 2014 12:47 AM | Updated on Sep 2 2017 5:03 PM

డీహెచ్‌ఎఫ్‌ఎల్ అంబాసిడర్ షారూక్

డీహెచ్‌ఎఫ్‌ఎల్ అంబాసిడర్ షారూక్

రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా...

హైదరాబాద్: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా నటుడు షారూక్ ఖాన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు షారూక్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని డీహెచ్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కపిల్ వాధ్వాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ 30 ఏళ్ల ప్రస్థానంలో ఒక బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.

భారత్‌లో రెండో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించామని వివరించారు. సొంత ఇల్లు సాధించడమనేది ప్రతి కుటుంబానికి భద్రమైన భవిష్యత్తుకు తొలి మెట్టు అని, దీని కోసం తోడ్పడే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని షారూక్ ఖాన్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement