పాన్ - ఆధార్ లింకింగ్‌ :  మరోసారి ఊరట | Deadline to link PAN with Aadhaar extended to March 2020 | Sakshi
Sakshi News home page

పాన్ - ఆధార్ లింకింగ్‌ :  మరోసారి ఊరట

Dec 31 2019 9:31 AM | Updated on Dec 31 2019 10:13 AM

Deadline to link PAN with Aadhaar extended to March 2020 - Sakshi

సాక్షి, ముంబై:  ఆధార్‌తో పాన్‌ వివరాలను లింక్‌ చేయని  వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి  శుభవార్త అందించింది.  పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో( డిసెంబర్ 31, 2019)  గడువును దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏఏ లోని ఉప-సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి  వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది.  పాన్-ఆధార్ లింకింగ్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సీబీడీటీ తాజాగా   గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి. పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement