డేటామెయిల్ నుంచి ‘డేటారేడియో’

న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషల్లో ఈమెయిల్ ఐడీ సేవలు అందించే డేటామెయిల్ సంస్థ తాజాగా వాయిస్ ఆధారిత సోషల్ మీడియా మెసేజింగ్ ఫీచర్ డేటారేడియోను ప్రవేశపెట్టింది. విపరీత కామెంట్లు, ఆన్‌లైన్ వేధింపులు మొదలైన వాటి గురించి భయపడనక్కర్లేకుండా యూజర్లు తమ ఫాలోయర్లకు ఆడియో సందేశాలను ప్రసారం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
డేటామెయిల్ యూజర్లు.. తమ పేర్లతో తమకంటూ ఓ రేడియో చానల్ రూపొందించుకోవచ్చని, దాని గురించి తెలిసిన వారు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చని డేటా ఎక్స్‌జెన్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో అజయ్ డేటా తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి