ఐదేళ్లలో టెలికం రంగంలో కోటి ఉద్యోగాలు | Crore jobs in telecom sector in five years | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో టెలికం రంగంలో కోటి ఉద్యోగాలు

Mar 26 2018 2:22 AM | Updated on Aug 11 2018 8:24 PM

Crore jobs in telecom sector in five years - Sakshi

న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమలో ఇటీవలి కాలంలో జియో రాక తర్వాత భారీ స్థిరీకరణతో ఉద్యోగాలకు నష్టం ఏర్పడగా, వచ్చే ఐదేళ్లలో మాత్రం ఏకంగా కోటి ఉద్యోగాల కల్పన జరుగుతుందని టెలికం రంగ నైపుణ్య మండలి అంటోంది. ‘‘టెలికం రంగంలో 40 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. ఐదేళ్ల తర్వాత టెలికంలో, టెలికం రంగ తయారీలోనూ కలిపి ఉపాధి పొందే వారి సంఖ్య 1.43 కోట్లు ఉంటుంది’’ అని టెలికం రంగ నైపుణ్య మండలి (టీఎస్‌ఎస్‌సీ) సీఈవో ఎస్‌పి కొచర్‌ తెలిపారు.

జాతీయ నైపుణ్య శిక్షణ కార్పొరేషన్‌ పరిధిలో టీఎస్‌ఎస్‌సీ పనిచేస్తోంది. మెషిన్‌ నుంచి మెషిన్‌ మధ్య సమాచారం, టెలికం తయారీ, మౌలిక సదుపాయలు, సేవల విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడుతుందని తాము అంచనా వేస్తున్నట్టు కొచర్‌ చెప్పారు. తయారీ రంగ అవకాశాలు భారత్‌కు వస్తున్నాయని, దీంతో టెలికం రంగంలో ఉపాధి అవకాశాలపై ఎక్కువ ఆశాభావంతో ఉన్నట్టు పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement