ఇది పేదరికానికి సూచిక! | Sakshi
Sakshi News home page

నలభైయేళ్లలో ఎన్నడూ లేనంతగా..

Published Fri, Nov 15 2019 4:22 PM

Consumer Spending Dropped First Time In 40 Years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివిధ వస్తువులను వాడటంలో వినియోగదారుల డిమాండ్‌కు సంబంధించి జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) ఓ సర్వేను విడుదల చేసింది. సర్వే ప్రకారం గత నలబై ఏళ్లుగా ఎన్నడు లేని విధంగా గ్రామీణ డిమాండ్‌ పడిపోయిందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం (2011-12) ప్రతి నెలలో 1,501రూపాయలు ఖర్చు చేసేవారని, కానీ ప్రస్తుతం (2017-2018) సర్వే ప్రకారం 3.7శాతానికి తగ్గి 1,446 రూపాయలు ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది.

ఈ నివేదికలు రూపొందించడానికి (2009-10)ను ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపిసిఇ) (2011-12)లో 13శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మరోవైపు గ్రామాల్లో వినియోగదారుల వ్యయం 2018సంవత్సరంలో 8.8శాతం తగ్గగా.. నగరాల్లో 2శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ మార్కెట్ డిమాండ్‌ తగ్గడమనేది దేశంలో పెరుగుతున్న పేదరికానికి సూచిక అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement