కాగ్నిజంట్ నికర లాభం 13 శాతం అప్ | Sakshi
Sakshi News home page

కాగ్నిజంట్ నికర లాభం 13 శాతం అప్

Published Thu, Aug 6 2015 12:43 AM

Cognizant's net profit up 13 percent

న్యూయార్క్ :  ఐటీ సేవల సంస్థ కాగ్నిజంట్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవల  విభాగాల్లో పటిష్టమైన వృద్ధి కారణంగా నికర లాభం 13 శాతం పెరిగిందని కాగ్నిజంట్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కనీసం 20 శాతం వృద్ధి సాధించగలమని  కంపెనీ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు. ఆదాయ వృద్ది అంచనాలను ఈ కంపెనీ ఈ ఏడాది రెండోసారి పెంచింది.  

గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 37 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 42 కోట్ల డాలర్లకు పెరిగిందని డిసౌజా తెలిపారు. ఆదాయం 252 కోట్ల డాలర్ల నుంచి 23 శాతం వృద్ధితో 309 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. డిజిటల్ వ్యాపారంలో అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంస్థ జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement