కోల్ ఇండియా చీఫ్‌గా సుతీర్థ భట్టాచార్య ఖరారు | Coal India gets S Bhattacharya as new chief | Sakshi
Sakshi News home page

కోల్ ఇండియా చీఫ్‌గా సుతీర్థ భట్టాచార్య ఖరారు

Dec 24 2014 12:57 AM | Updated on Sep 2 2017 6:38 PM

కోల్ ఇండియా చీఫ్‌గా సుతీర్థ భట్టాచార్య ఖరారు

కోల్ ఇండియా చీఫ్‌గా సుతీర్థ భట్టాచార్య ఖరారు

ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాకు కొత్త చైర్మన్..

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాకు కొత్త చైర్మన్, ఎండీగా సుతీర్థ భట్టాచార్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ సంస్థల ఎంపికలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ(ఏసీసీ) ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

1985 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన భట్టాచార్య ప్రస్తుతం సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డ్(పీఎస్‌ఈబీ) గత నెలలోనే కోల్ ఇండియా చైర్మన్ పదవికి భట్టాచార్యను ఎంపిక చేసింది. ఈ పదవిని చేపట్టేందుకు మొత్తం 18 మంది అభ్యర్థులు పోటీపడ్డ సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement