హైదరాబాద్‌లో ఇన్వెకాస్ డిజైన్ సెంటర్ | Chip design firm INVECAS,partners Global Foundries | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇన్వెకాస్ డిజైన్ సెంటర్

Apr 23 2015 1:07 AM | Updated on May 24 2018 2:36 PM

హైదరాబాద్‌లో ఇన్వెకాస్ డిజైన్ సెంటర్ - Sakshi

హైదరాబాద్‌లో ఇన్వెకాస్ డిజైన్ సెంటర్

సెమికండక్టర్ ఐపీ డిజైనింగ్ రంగంలో ఉన్న ఇన్వెకాస్ టెక్నాలజీస్ హైదరాబాద్, బెంగళూరులో డిజైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది.

* రెండేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి
* కంపెనీ చైర్మన్ దశరథ గుడె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెమికండక్టర్ ఐపీ డిజైనింగ్ రంగంలో ఉన్న ఇన్వెకాస్ టెక్నాలజీస్ హైదరాబాద్, బెంగళూరులో డిజైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ తొలుత రూ.120 కోట్ల దాకా వ్యయం చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు కేంద్రాల్లో కలిపి 200 మంది నిపుణులు ఉన్నారు.

రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య 1,000కి చేరుతుందని ఇన్వెకాస్ చైర్మన్ దశరథ ఆర్ గుడె తెలిపారు. గ్లోబల్ ఫౌండ్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ మెహనీతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.  ఆర్‌అండ్‌డీ, శిక్షణకు రెండేళ్లలో రూ.300 కోట్ల దాకా పెట్టుబడి పెడతామని చెప్పారు. చిప్ తయారీలో ఉన్న అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ ఫౌం డ్రీస్ సహకారం ఉంటుందని వెల్లడించారు. ఇన్వెకాస్ డిజైన్ చేసి టన చిప్‌ను గ్లోబల్ ఫౌండ్రీస్ త యారు చేస్తుందని వివరించారు.
 
భారత్‌లో ఒకే కంపెనీ..
ప్రపంచంలో గ్లోబల్ ఫౌండ్రీస్, టీఎస్‌ఎంసీ, ఇంటెల్, శాంసంగ్‌లు మాత్రమే చిప్ తయారీలో ఉన్నాయి. సెమికండక్టర్ రంగంలో 14 నానోమీటర్ ఫిన్‌ఫెట్ టెక్నాలజీపైన భారత్‌లో పనిచేస్తున్న ఏకైక కంపెనీ తమదేనని దశరథ పేర్కొన్నారు. 10 నానోమీటర్ టెక్నాలజీలోకి ప్రవేశిస్తామని వెల్లడించారు. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన చిప్‌లతో విద్యుత్ ఆదా అవడమేగాక ఎక్కువ ఫీచర్లుంటాయని వివరించారు. స్మార్ట్ వాచెస్, గ్రాఫిక్స్, స్మార్ట్‌ఫోన్లలో ఇటువంటి వాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement