జీడీపీకి నోట్ల రద్దు, జీఎస్‌టీ భారీ దెబ్బ

Cash ban, GST to cool GDP growth to 4-year low at 6.7%, shows poll - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఒకవైపు కేంద్ర  ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులకు భారీ రీక్యాపిటలైజేషన్‌కు ప్రకటించగా మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ మరింత మందగించనుందని  తాజాగా 30 మంది ఆర్థిక వేత్తల అంచనా తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్టానికి పడిపోనుందని అంచనాలు  వెలువడ్డాయి. మార్చి 2018 తో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కానుందని అంచనా. నోట్ల రద్దు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీ  కారణంగా  వ్యాపార కార్యకలాపాలు, వినియోగదారుల డిమాండ్‌ భారీగా క్షీణించనుందని రాయిటర్స్‌ పోల్‌ లో వెల్లడైంది

2014-15ఆర్థిక సంవత్సరంలో పరిచయం చేసిన కొత్త విధానం ప్రకారం  భారత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు.. 2018 మార్చ్‌తో ముగిసిన కాలానికి 6.7 శాతంగా నమోదు కావచ్చంటూ  రాయిటర్స్‌  పోల్‌ లో తేలింది.  ఇది గత నాలుగేళ్లలో అత్యంత కనిష్టం.   అక్టోబర్‌ 12-124మధ్య నిర్వహించిన 30 మంది ఆర్థికవేత్తల అంచనాలను పరిగణలోకి తీసుకుని రాయిటర్స్ పోల్ ఈ అంచనాలను వెల్లడించింది. ముఖ్యంగా డిమానిటైజేషన​ తర్వాతి పరిస్థితులు..  ఒకేదేశం ఒకటే పన్ను అంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ల కారణంగా బిజినెస్ యాక్టివిటీ, కన్జూమర్ డిమాండ్‌లో విపరీతమైన ఒత్తిడి  నెలకొంది. కరెన్సీ నిషేధం, కొత్త వస్తువులు, సేవల పన్ను (జిఎస్టి) వ్యాపార కార్యకలాపానికి అంతరాయం కలిగించి, వినియోగదారుల డిమాండ్‌ తగ్గడంతో ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ  వృద్ధి మరింత  నెమ్మదించి  నాలుగు సంవత్సరాల   కిందికి దిగజారనుందని తెలిపింది. ఇప్పటికే అభివృద్ధి ఔట్‌లుక్‌పై రిస్క్ తగ్గినా.. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్‌పై ఒత్తిడి కొనసాగవచ్చని, ప్రైవేట్ క్యాపిటల్ ఖర్చులు తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top