వాహన విక్రయాలు జంప్‌ | Car sales grow 7%, passenger vehicles up 11% in September  | Sakshi
Sakshi News home page

వాహన విక్రయాలు జంప్‌

Oct 9 2017 3:14 PM | Updated on Oct 9 2017 3:14 PM

Car sales grow 7%, passenger vehicles up 11% in September 

న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్‌ వాహన విక్రయాలు 11.32 శాతం పైకి జంప్‌ చేశాయి. గతేడాది సెప్టెంబర్‌ నెలలో 2,78,428 యూనిట్లుగా ఉన్న ఈ విక్రయాలు, ఈ ఏడాది ఇదే నెలలో 3,09,955 యూనిట్లుగా నమోదయ్యాయి. కారు అమ్మకాలు కూడా 6.86 శాతం పెరిగాయి. 1,95,259 యూనిట్ల నుంచి 2,08,656 యూనిట్లకు పెరిగినట్టు సియామ్‌ డేటాలో వెల్లడైంది.

మోటార్‌ సైకిల్‌ విక్రయాలు కూడా గత నెలలో 6.98 శాతం పెరిగాయని, 2016 సెప్టెంబర్‌లో 11,86,759 యూనిట్లుగా ఉన్న ఈ విక్రయాలు 12,69,612 యూనిట్లకు పెరిగినట్టు తెలిసింది. మొత్తం టూ-వీలర్‌ అమ్మకాలు 9.05 శాతం వృద్ధి సాధించి 20,41,024 యూనిట్లగా నమోదయ్యాయి. కమర్షియల్‌ వాహనాల విక్రయాలు భారీగా 25.27 శాతం పెరిగి 77,195 యూనిట్లగా నమోదైనట్టు సియామ్‌ డేటాలో తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement