‘ప్రజాస్వామ్యానికి మంచిదని చెప్పలేం’

Cannot guarantee social media is good for democracy says Facebook - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో, అమెరికా : ప్రజాస్వామ్యానికి సోషల్‌మీడియా మంచి చేస్తుందనే గ్యారెంటీని ఇవ్వలేమని సోమవారం ఫేస్‌బుక్‌ స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో రష్యా తదితర దేశాల ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.

రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాల ఎన్నికల సమయంలో సోషల్‌మీడియాను వినియోగించుకుని రష్యా ఫేక్‌న్యూస్‌ను సర్క్యూలేట్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను రష్యా ఖండించింది.

దాదాపు రెండు బిలియన్ల యూజర్లను కలిగిన ఫేస్‌బుక్‌ ‘ప్రజాస్వామ్యంలో సోషల్‌మీడియా పాత్ర’ అనే అంశంపై చర్చించింది. ఇకపై ఎన్నికల సమయంలో అనుమానిత అకౌంట్లను సస్పెండ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

ఎన్నికల యాడ్‌లను ఎక్కువమందికి చేరేలా చూస్తామని చెప్పింది. అయితే, ఇందుకోసం యాడ్‌లు ఇచ్చే వారి దగ్గర నుంచి గుర్తింపును కోరనున్నట్లు తెలిపింది. కాగా, ఫేస్‌బుక్‌ బాటలోనే ట్విటర్‌, గూగుల్‌, యూట్యూబ్‌లు కూడా నడవనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top