మరింత పటిష్టంగా వినియోగ హక్కుల చట్టాలు | Can achieve 9% GDP with improved agri and exports: Jaitley | Sakshi
Sakshi News home page

మరింత పటిష్టంగా వినియోగ హక్కుల చట్టాలు

May 30 2015 1:13 AM | Updated on Apr 6 2019 9:38 PM

మరింత పటిష్టంగా వినియోగ హక్కుల చట్టాలు - Sakshi

మరింత పటిష్టంగా వినియోగ హక్కుల చట్టాలు

వినియోగ హక్కుల చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఉద్ఘాటించారు.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: వినియోగ హక్కుల చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఉద్ఘాటించారు. విక్రయ కంపెనీల నుంచి ఏదైనా అన్యాయం జరిగితే- ప్రజలు ఐక్యంగా (క్లాస్ యాక్షన్ సూట్స్) న్యాయపోరాటం చేసేలా చట్టాల పటిష్టత అవసరమని వివరించారు. వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (కన్జూమర్ ఫోరమ్స్)లను మరింత పటిష్టవంతం చేయడానికి ఇక్కడ ఒక జాతీయ సదస్సు జరిగింది.

ఈ సదస్సులో ఆరుణ్ జైట్లీ మాట్లాడుతూ... ఈ-కామర్స్ రంగంలో వాణిజ్యం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వినియోగ దారుల హక్కులకు సంబంధించిన చట్టాలనూ మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
 
మారుతున్న వాణిజ్య, వ్యాపార విధానాల నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధిత చట్టాన్ని (1986) ప్రభుత్వం సవరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లు క్యాబినెట్ ముందు పరిశీలనలో ఉందని కూడా తెలిపారు. కాగా, 1986 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్ట సవరణకు సంబంధించి వస్తున్న వార్తలను వినియోగదారుల సమస్యల పరిష్కార జాతీయ వేదిక (ఎన్‌సీడీఆర్‌సీ) ప్రెసిడెంట్ జస్టిస్ డీకే జైన్ ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు.
 
క్లాస్ యాక్షన్ సూట్స్ కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు ప్రతిపాదన ప్రతిపాదిత బిల్లులో ఉందన్న వార్తలపై ఆయన స్పందిస్తూ... దీనివల్ల ఆయా అంశాలకు సంబంధించి ‘సమాంతర న్యాయప్రక్రియ’ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement