రూ.123 కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ విస్తరణ

BSNL 4G Expansion With 123 Crore Rupees - Sakshi

తెలంగాణ సర్కిల్‌లో డిసెంబర్‌లోగా పనులు పూర్తి

వచ్చే ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లో 4జీ సేవలు

తెలంగాణ టెలికం సర్కిల్‌ సీజీఎం సుందరం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సర్కిల్‌లో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో రూ.123 కోట్ల వ్యయంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) సుందరం వెల్లడించారు. పైలట్‌ ప్రాజెక్టుగా మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల, ఖమ్మంలోని వైరాలో 4జీ టెస్టింగ్‌ చేపట్టామన్నారు. తెలంగాణ సర్కిల్‌లో ఆగస్టులో విస్తరణ పనులు ప్రారంభించి డిసెంబర్‌లోగా 4జీ సేవలు అందిస్తామని, హైదరాబాద్‌లో వచ్చే ఏడాది మార్చి నాటికి 4జీ సేవలను విస్తరిస్తామని చెప్పారు.

బుధవారం హైదరాబాద్‌ దూర్‌ సంచార్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌ కలిగిన ప్రాంతాల్లో 4జీ సేవలు విస్తరిస్తున్నామని, ఇప్పటికే 2జీ నెట్‌వర్క్‌ కలిగిన టవర్స్‌ను అభివృద్ధి చేస్తామని, కొత్తగా 409 4జీ టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెట్రో రైలు కారిడార్‌లో 64 టవర్స్‌ ఏర్పాటు చేసి 3జీ సేవలు విస్తరిస్తున్నామని, ఇప్పటికే 26 స్టేషన్లల్లో 2జీ టవర్స్‌ ఏర్పాటు చేశామని, మిగిలి స్టేషన్లలో సైతం టవర్స్‌ ఏర్పాటు చేసి 3జీ సేవలు అందిస్తామన్నారు. 

రూ.1,199కి ఫ్యామిలీ ప్లాన్‌ ఆఫర్‌ 
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యామిలీ బీబీజీ కాంబో యూఎల్‌డీ 1199ను ప్రవేశపెట్టినట్లు సీజీఎం సుందరం చెప్పారు. రూ.1199తో నెలకు అన్‌లిమిటెడ్‌ బ్రాడ్‌బాండ్‌ 10 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ 30 జీబీ వరకు, రెంట్‌ ఫ్రీ ల్యాండ్‌లైన్‌ 24 గంటలు అన్‌లిమిటెడ్‌ ఉచిత కాలింగ్, మూడు మొబైల్‌ కనెక్షన్లకు అన్‌లిమిటెడ్‌ ఉచిత లోకల్, ఎస్టీడీ ఎనీ నెట్‌వర్క్, రోజుకు 1జీబీ డాటా వర్తిస్తుందన్నారు. బ్రాడ్‌బాండ్‌ ప్రమోషన్‌ ఆఫర్‌గా బీబీ 99, బీబీ 199, బీబీ 299, బీబీ 491 ప్లాన్‌లను తీసుకొచ్చామని, అన్‌లిమిటెడ్‌ బ్రాడ్‌బాండ్, 20 ఎంబీపీఎస్‌ స్పీడ్, 24 గంటలు ఉచితం కాలింగ్‌ ఎనీ నెట్‌వర్క్‌కు వర్తిస్తోందన్నారు. ప్లాన్‌ను బట్టి 1.5 జీబీ నుంచి 20 జీబీ డాటా వస్తుందన్నారు.

ఫైబర్‌ కాంబో 777 ఆఫర్‌ కింద అన్‌లిమిటెడ్‌ బ్రాడ్‌బాండ్, 50 ఎంబీపీస్‌ స్పీడ్‌ 500 జీబీ వరకు, 1277 ఆఫర్‌ కింద 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ 750 జీబీ వరకు డాటా, అన్‌లిమిటెడ్‌ లోకల్, ఎస్టీడీ వాయిస్‌ కాల్స్‌ ఉచితమన్నారు. బీబీ 299 కింద అన్‌లిమిటెడ్‌ బ్రాడ్‌బ్యాండ్, 30 ఎంబీపీఎస్‌ 100 జీబీ వరకూ.. 399 ప్లాన్‌ కింద అన్‌లిమిటెడ్‌ బ్రాడ్‌బ్యాండ్, 30 ఎంబీపీఎస్‌ 200 జీబీ వరకు వర్తిస్తుందన్నారు. అనంత–105, అనంతప్లస్‌–328, పోస్ట్‌పెయిడ్‌లో ఎంఎంసీ–399 ప్లాన్‌లు.. ఎస్‌టీవీలో ఈద్‌ ముబారక్‌–786, ఎస్‌టీవీ–148, డాటా సునామీ–98, ఎస్‌టీవీ–118, ఎస్‌టీవీ–44 ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. టాపప్‌లో అన్ని ఆదివారాల్లో రూ.160కి çఫుల్‌ టాక్‌టైమ్, టాపప్‌ రూ.310కి అన్ని రోజుల్లో ఫుల్‌ టాక్‌టైమ్‌ వర్తిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో టెలికం హైదరాబాద్‌ పీజీఎం రాంచంద్రం పాల్గొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top