చార్మినార్ వద్ద బ్రెయిలీ బోర్డ్: అరుంధతీ భట్టాచార్య | Braille board at Charminar: Arundhati Bhattacharya | Sakshi
Sakshi News home page

చార్మినార్ వద్ద బ్రెయిలీ బోర్డ్: అరుంధతీ భట్టాచార్య

Dec 12 2015 2:47 AM | Updated on Sep 3 2017 1:50 PM

చార్మినార్ వద్ద బ్రెయిలీ బోర్డ్:  అరుంధతీ భట్టాచార్య

చార్మినార్ వద్ద బ్రెయిలీ బోర్డ్: అరుంధతీ భట్టాచార్య

ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ముఖ్య కార్యాలయాన్ని సందర్శించారు.

హైదరాబాద్: ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ముఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ‘సభా గృహ’ అనే కొత్త ఆడిటోరియమ్‌ను ప్రారంభిం చారు. అలాగే ఎస్‌బీహెచ్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమై 75 వసంతాలు పూర్తికానుండటంతో బ్యాంకు ప్లాటినమ్ జూబ్లీ లోగోను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌బీహెచ్ కమ్యూనిటీ సర్వీసెస్ బ్యాంకింగ్ కార్యకలాపాల కింద ఏడాదిపాటు 15 పులుల సంరక్షణకు గానూ నెహ్రూ జంతు ప్రదర్శన శాలకు రూ.15 లక్షలు, చార్మినార్ వద్ద బ్రెయిలీ బోర్డు ఏర్పాటు, అంధులకు ప్రత్యేక  దారి నిర్మాణానికి సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు రూ.2 లక్షలను విరాళంగా అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement