ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ పెట్టుబడులు 

Blackstone major investment in Future Lifestyle Fashions - Sakshi

6 శాతం వాటా కొనుగోలు 

డీల్‌ విలువ రూ.1,750 కోట్లు   

న్యూఢిల్లీ: కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీ, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌)లో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ బ్లాక్‌స్టోన్‌ రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌ హోల్డింగ్‌కంపెనీ రైకా కమర్షియల్‌ వెంచర్స్‌లో బ్లాక్‌స్టోన్‌ నిర్వహణలోని ఫండ్స్‌ ఈ మేరకు ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ లావాదేవీలో భాగంగా ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌లో 6 శాతం వాటా బ్లాక్‌స్టోన్‌ పరమైంది. కాగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కారణంగా రైకాలో ఉన్న ఏకైక ఆర్థిక భాగస్వామిగా బ్లాక్‌స్టోన్‌ నిలిచింది. ఈ నిధులను రైకా సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తారు.  

బ్లాక్‌స్టోన్‌కు తొలి ‘ఫ్యాషన్‌’ పెట్టుబడి.... 
ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన సెంట్రల్, బ్రాండ్‌ ఫ్యాక్టరీ, ప్లానెట్‌ స్పోర్ట్స్‌  రిటైల్‌ చెయిన్స్‌ను ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ నిర్వహిస్తోంది. కాగా ఈ రంగంలో తమకు ఇది తొలి ఇన్వెస్ట్‌మెంట్‌ అని బ్లాక్‌స్టోన్‌ ఎమ్‌డీ లవ్‌ పారిఖ్‌ పేర్కొన్నారు. మరోవైపు తమ ఫ్యాషన్‌ వ్యాపారం నిలకడగా వృద్ధి సాధిస్తోందని ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఈఓ కిశోర్‌ బియానీ చెప్పారు. ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి బ్లాక్‌స్టోన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తోడ్పాటునందిస్తాయని వివరించారు.  

ఈ ఏడాది సెపె్టంబర్‌ నాటికి ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ 48 సెంట్రల్‌ స్టోర్స్‌ను, 100 బ్రాండ్‌ ఫ్యాక్టరీ అవుట్‌లెట్లను, 201 ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది. లీ కూపర్, ఇండిగో నేషన్, జెలస్‌ 21 వంటి 30కు పైగా ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.5,377 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బీఎస్‌ఈలో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ కంపెనీ షేరు స్వల్ప లాభంతో రూ.395 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top