అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

Bharti Airtel approves Bharti Infratel, Indus Towers merger - Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ టెలికాం దిగ్గజం  భారతి ఎయిర్‌టెల్‌ తన టవర్‌ యూనిట్‌ను   ప్రత్యర్థి కంపెనీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. భారతి ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్‌ను ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 10.8 బిలియన్‌ డాలర్లు(రూ. 71,500 కోట్లు)ఈ ఒప్పందంలో భారతి ఇన్ఫ్రాటెల్ ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565  షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్‌టెల్‌ రెగ్యులేటరీ  ఫైలింగ్లో వెల్లడించింది.   2019 , మార్చి 31 ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నామని తెలిపింది

తాజా డీల్‌తో  చైనా వెలుపల  భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌ ఆవిర్భవిస్తుంది.  విలీనం తరువాత  ఆవిర్భవించే ఉమ్మడి సంస్థ ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌గా    కొనసాగనుంది. దీనికి మార్కెట్‌ రెగ్యులేటర్ల తుది ఆమోదం  పొందాల్సి ఉంది. సంస్థగా విలీనం అనంతరం భారతదేశం అంతటా 163,000కు పైగా టవర్లను  నియంత్రిస్తుంది.  మరోవైపు ఒప్పందం ప్రకారం భారతి-ఇండస్  జాయింట్‌ సంస్థలో 783.1 మిలియన్ల కొత్త షేర్లు  వోడాఫోన్‌కు లభిస్తాయి. అయితే ఇండస్‌లో వాటాను మరో టెలికాం సం‍స్థ ఐడియా అమ్ముకోవచ్చు లేదా, అదనంగా కొత్తషేర్లను కొనుక్కునే అవకాశాన్ని కల్పించింది.  ఈ వార్తల అనంతరం భారతి ఎయిర్‌టెల్‌ 2 శాతం లాభాలతో కొనసాగుతుండగా , భారతి ఇన్‌ఫ్రాటెల్‌  స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. 

కాగా ఇన్‌ఫ్రాటెల్‌, వొడాఫోన్‌ ఇండియాలకు ఇండస్‌ టవర్స్‌లో 42 శాతం వాటా ఉండగా మిగిలిన వాటా ఐడియా సెల్యులార్‌ది.  తాజా ఒప‍్పందంతో సమీప ప్రత్యర్థి అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌తో పోలిస్తే రెండున్నర రెట్ల పరిమాణం గల కంపెనీ అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా  వేస్తున్నాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top