
న్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగానికి చెందిన బజాజ్ ఫైనాన్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ3 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఆశాజనక త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది.
గడేడాది మూడో త్రైమాసిక కాలంలో నికర లాభం రూ.690 కోట్లు కాగా, తాజా క్యూ3లో రూ.1,060 కోట్లను ఆర్జించి.. ఏకంగా 54 శాతం వృద్ధిరేటును సాధించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 48 శాతం వృద్ధితో రూ.4,995 కోట్లకు ఎగసింది. అంతకుముందు ఏడాది క్యూ3లో రూ.3,374 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.