ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ, బజాజ్ ఫిన్‌సర్వ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్.. ఈ పండుగ సీజన్‌లో తమ వినియోగ ఫైనాన్స్‌లో పెరుగుదల కనిపించిందని, రికార్డు స్థాయిలో కన్స్యూమర్ రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రుణ వాల్యూమ్‌లో 27 శాతం, విలువలో 29 శాతం పెరిగిందని పేర్కొంది.
వినియోగ వస్తువుల కోసం అందించే రుణాల కేటాయింపులు పెరగడం, వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు, వ్యక్తిగత ఆదాయ పన్నులో మార్పుల సానుకూల ఫలితాన్ని బజాజ్ ఫైనాన్స్ రుణాల పెరుగుదల ప్రతిబింబిస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 26 వరకు సుమారు 63 లక్షల రుణాలను పంపిణీ చేసింది. ఈ కాలంలో కంపెనీ 23 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. రుణాల్లో 52% కొత్తగా ఇచ్చినవేనని కంపెనీ వివరించింది.
టీవీలు, ఎయిర్ కండిషనర్లపై జీఎస్టీ తగ్గించడం వలన వినియోగదారులు ఉన్నత స్థాయి ఉత్పత్తులకు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలుకలిగింది. ముఖ్యంగా టీవీల విషయంలో ప్రీమియంవైపు వినియోగదారులు మొగ్గుచూపారు. 40-అంగుళాలు, అంతకంటే ఎక్కువ సైజ్ స్క్రీన్‌ల కోసం చాలామంది రుణాలు తీసుకున్నారు. కంపెనీ ద్వారా ఫైనాన్స్ చేసిన మొత్తం టీవీలలో 71% వాటా వీటిదే కావడం విశేషం.


