మోడర్నాలో ప్రేమ్‌జీ పెట్టుబడులు | Azim Premji Investments In Moderna Company | Sakshi
Sakshi News home page

మోడర్నాలో ప్రేమ్‌జీ పెట్టుబడులు

May 20 2020 10:14 PM | Updated on May 20 2020 10:27 PM

Azim Premji Investments In Moderna Company - Sakshi

ముంబై: ప్రముఖ సాఫ్టవేర్‌ దిగ్గజం విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ కరోనా వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ మోడర్నాలో పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ‌అమెరికాకు చెందిన మోడర్నా అనే బయోటెక్ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌ తీసుకొచ్చేందుకు వేగంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.  ‘ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ-1273 అనే ఈ వ్యాక్సిన్‌ను మోడర్నా తయారుచేసింది. ప్రేమ్‌జీ 25నుంచి 30మిలియన్‌ డాలర్లు మోడర్నాలో పెట్టుబడులు పెట్టారు. వ్యాక్సిన్‌ విజయవంతం అవ్వాలంటే హ్యూమన్ ట్రయల్స్‌లో మూడు దశల్లో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాకుంటే.. వ్యాక్సిన్‌ విజయవంతమయ్యినట్లు గుర్తిస్తారు. ఇటీవల 45మంది కరోనా వ్యాధిగ్రస్తుల్లో ప్రయోగించగా వ్యాక్సిన్‌ సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

చదవండి: అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ. 1125 కోట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement