పెనాల్టీలను తప్పించుకోవచ్చు.. | Avoid penalties .. | Sakshi
Sakshi News home page

పెనాల్టీలను తప్పించుకోవచ్చు..

Aug 22 2016 12:02 AM | Updated on Sep 4 2017 10:16 AM

పెనాల్టీలను తప్పించుకోవచ్చు..

పెనాల్టీలను తప్పించుకోవచ్చు..

రిటర్నుల దాఖలుకు ఈ నెల 5తో గడువు తేదీ అయిపోయింది. కాకపోతే ఏదైనా కారణం వల్ల రిటర్న్ దాఖలు చేయనివారు...

రిటర్నుల దాఖలుకు ఈ నెల 5తో గడువు తేదీ అయిపోయింది. కాకపోతే ఏదైనా కారణం వల్ల రిటర్న్ దాఖలు చేయనివారు చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేసినా పర్వాలేదు. టీడీ ఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా మొత్తం పన్ను భారం మార్చి 2016లో చెల్లించిన ట్లయితే... ఈ రోజు/రేపు అంటే గడువు తేది తర్వాత రిటర్న్ దాఖలు చేయవచ్చు. అదనంగా వడ్డీ చె ల్లించాల్సిన పనిలేదు. ఎటువంటి ప్రమాదం లేదు. గాబరా పడనక్కర్లేదు. వెంటనే వేయండి.

  
ఒకవేళ రిఫండ్ క్లెయిమ్ చేయ్యాలనుకోండి. ఈ రోజు వేసినా మీ రిఫండ్ మీకు వస్తుంది. మీ రిఫండ్‌కి ఏ ఢోకా లేదు. అయితే డిపార్ట్‌మెంట్ వారు మీకు రిఫండ్ మీదిచ్చే నామమాత్రపు వడ్డీ మాత్రం ఇవ్వరు. ఇది స్వల్పంగా ఉంటుంది.గడువు తేది దాటిపోయింది. రిటర్నులు వేయలేదు. పన్ను భారం పూర్తిగా కాకుండా కొంత భాగమే చెల్లించారు. ఈ సందర్భాల్లో మీకు అదనంగా వడ్డీ వడ్డిస్తారు. చెల్లించవలసిన ప్రతి వంద కి.. నెలకి 25 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. బయటి నుంచి ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి పన్నులు చెల్లించడం కన్నా.. ఒకటి లేదా రెండు నెలల జాప్యం జరిగి రిటర్నులు ఆలస్యంగా వేయడంతో వడ్డీ మినహా ఎలాంటి నష్టం లేదు. కానీ ఎక్కువ మొత్తం బకాయి ఉన్నప్పుడు ఈ వడ్డీలు తడి సి మోపెడవుతాయి. వడ్డీ చెల్లించడం వలన ఆదాయం పెరగదు. వడ్డీని ఖర్చుగా పరిగణించరు.


వ్యాపారం, స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, ఇంటి రుణ వడ్డీ, క్యాపిటల్ గెయిన్ వంటి అంశాల్లో నష్టం వాటిల్లిన సందర్భాల్లో గడువు తేదిలోపు రిటర్నులు వేయకపోతే ఈ నష్టాన్ని బదిలీ చేయరు. సకాలంలో వేయడం వలన ఇలాంటి నష్టాల్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేస్తారు. ఇలా చేయడంతో ఈ నష్టం మేరకు వచ్చే సంవత్సరంలో ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా పన్ను భారమూ తగ్గుతుంది. ఇది ఎంతో ప్రయోజనకరం. దీనిని దృష్టిలో ఉంచుకొని రిటర్నులు సకాలంలో వేయాలి.


2015-16 ఆర్థిక సంవత్సరం రిటర్నును 31.03.2017లోగా దాఖలు చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. అలాగే సెల్ఫ్ అసెస్‌మెంట్ పన్ను కట్టకపోయినా.. అసెస్‌మెంట్ జరిపిన తర్వాత డిమాండ్ చెల్లించకపోయినా పెనాల్టీలు పడతాయి. ఇంచుమించు ప్రతి తప్పుకి పెనాల్టీలు ఉన్నాయి. వీటి వలన మీ ట్రాక్ రికార్డ్ పాడవుతుందన్న విషయం.

కె.సీహెచ్.  ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి & కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement