శాండోజ్‌ కొనుగోలు ఒప్పందం రద్దు

Aurobindo, Sandoz call off USD 900 million deal - Sakshi

అరబిందో–శాండోజ్‌ పరస్పర అంగీకారం

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ జనరిక్‌ ఫార్మా కంపెనీ శాండోజ్‌ను కొనుగోలు చేసే ఒప్పందాన్ని అరబిందో ఫార్మా రద్దు చేసుకుంది. అనుకున్న సమయంలోగా యూఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ నుంచి అనుమతి రాకపోవడంతో ఇరు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. నోవార్టిస్‌ కంపెనీకి చెందిన శాండోజ్‌ అమెరికాలో జనరిక్‌ ఔషధాలు, బయోసిమిలర్‌ ఔషధాల్లో దిగ్గజ కంపెనీగా ఉంది. నోవార్టిస్‌ డివిజన్‌గా ఉన్న శాండోజ్‌ ఐఎన్‌సీ వాణిజ్య కార్యకలాపాలను, మూడు తయారీ కేంద్రాలను 900 మిలియన్‌ డాలర్లతో సొంతం చేసుకునేందుకు అరబిందో ఫార్మా 2018 సెప్టెంబర్‌లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అమెరికాలో తన సొంత సబ్సిడరీ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ ఐఎన్‌సీ ద్వారా శాండోజ్‌ను సొంతం చేసుకోవాలనుకుంది. ఇది సఫలమై ఉంటే అమెరికాలో ప్రిస్క్రిప్షన్‌ ఔషధాల పరంగా రెండో అతిపెద్ద జనరిక్‌ ఔషధ కంపెనీగా అరబిందో అవతరించి ఉండేది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top