
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ ‘క్యూ5’లో పెట్రోల్ వేరియంట్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.55.27 లక్షలు. కొత్త వేరియంట్‌లో 7 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
‘క్యూ5 పెట్రోల్ ఇంజిన్ హార్స్‌పవర్ 252. ఇది గరిష్టంగా గంటకు 237 కిలోమీటర్లు వెళ్తుంది. 0– 100 వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది’ అని ఆడి ఇండియా తెలిపింది. ఇక ఇందులో ఆల్–వీల్ డ్రైవ్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్, యాంటి–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ సిస్టమ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ క్యూ5 డీజిల్ వేరియంట్‌ను తీసుకువచ్చింది.