ఆకర్షణీయంగా ఆటోమొబైల్, కార్పొరేట్‌ బ్యాంకులు

Attractive Automobile And Corporate Banks - Sakshi

ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో జోసెఫ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆటోమొబైల్, కార్పొరేట్‌ బ్యాంకులు, పటిష్టమైన నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, ఫార్మా, టెలికం సంస్థలు ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ సీఈవో జార్జి హెబర్‌ జోసెఫ్‌ తెలిపారు. పదేళ్ల వ్యవధిలో రియల్టీ కూడా మంచి రాబడులు అందించగలదని పేర్కొన్నారు. మరోవైపు అధిక వేల్యుయేషన్స్‌ ఉన్న ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ స్టేపుల్స్‌ వంటి రంగాల సంస్థలకు దూరంగా ఉండటం శ్రేయస్కరమని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.

స్మాల్‌ క్యాప్‌ సంస్థల విషయంలో బులి‹Ùగా ఉన్నట్లు జోసెఫ్‌ చెప్పారు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతి వచ్చిన పక్షంలో వచ్చే ఏడాది జనవరిలో దీన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థ ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) రూ. 200 కోట్లుగా ఉందన్నారు. 13 శాఖలు ఉండగా.. మార్చి ఆఖరు నాటికి 25కి పెంచుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు, తాజాగా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజి ఫండ్‌ను ప్రారంభించినట్లు జోసెఫ్‌ తెలిపారు. ఇది డిసెంబర్‌ 23తో ముగుస్తుంది. సందర్భానుసారంగా ఈక్విటీ, డెట్‌ సాధనాల్లోకి ఇన్వెస్ట్‌ చేస్తూ మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్‌ ప్రత్యేకతని జోసెఫ్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top