హీరో మహేష్‌కు ఝలక్‌: బ్యాంకు ఖాతాలు సీజ్‌

Attachement  of bank accounts   of Film Hero  GMahesh Babu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌  హీరో మహేష్‌ బాబుకు జీఎస్‌టీ షాక్‌ తగిలింది. పన్ను బకాయిలు చెల్లించాలంటూ మహేష్‌బాబుకు చెందిన పలు బ్యాంకు ఖాతాలను  అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రకటనలు, ప్రమోషన్‌,  బ్రాండ్‌ అంబాసిడర్‌గా అందించిన సేవలకు గాను మహేష్‌కు లభించిన ఆదాయంపై పన్ను చెల్లించలేదని జీఎస్‌టీ ఆరోపించింది.  సత్వరమే ఈ పన్ను బకాయిలు చెల్లించాలని  కోరుతూ నోటీసులిచ్చింది.

గత తొమ్మిదేళ్లుగా పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు ఆయన బ్యాంకు ఖాతాలను ఎటాచ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ జీఎస్‌టీ కమిషనరేట్‌ ఒక ప్రకటన జారీ చేసింది. 2007-08 సంవత్పరానికి గాను సర్వీస్‌ టాక్స్‌ చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. ఈ కాలానికి  మొత్తం 18.5 లక్షల రూపాయలు బకాయి ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్‌కు చెందిన యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌లను సీజ్‌ చేసింది. పన్ను, జరిమానా, వడ్డీతోసహా మొత్తం 73.5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top