ఆ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడుతున్నారా జాగ్రత్త!

Android Malware Targets 232 Banking Apps Including Indian Banks - Sakshi

బ్యాంకింగ్‌ యాప్స్‌ టార్గెట్‌గా మరో పెనుభూతం వచ్చింది. పలు భారతీయ బ్యాంకుల యాప్స్‌తో సహా 232 బ్యాంకింగ్‌ యాప్స్‌ను 'ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ9480' అనే ట్రోజన్‌ మాల్‌వేర్‌ టార్గెట్‌ చేసిందని హీల్‌ సెక్యురిటీ ల్యాబ్స్‌ రిపోర్టులు వెల్లడించాయి. యూజర్ల లాగిన్‌ డేటా, ఎస్‌ఎంఎస్‌, కాంటాక్ట్‌ లిస్టులను హానికర సర్వర్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు పేర్కొన్నాయి. అదనంగా బ్యాంకింగ్‌ యాప్స్‌తో పాటు, యూజర్ల ఫోన్లలో వాడే క్రిప్టోకరెన్సీ యాప్స్‌ను కూడా ఈ ట్రోజన్‌ టార్గెట్‌ చేసిందని తెలిపింది.

ఆండ్రాయిడ్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ మాల్‌వేర్‌ టార్గెట్‌ చేసిన దేశీయ బ్యాంకింగ్‌ యాప్స్‌ జాబితాను కూడా క్విక్‌ హీల్‌ విడుదల చేసింది. వాటిలో యాక్సిస్‌ మొబైల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ ఎనీవేర్ పర్సనల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్‌బ్యాంకింగ్‌ లైఫ్‌, ఐసీఐసీఐ బ్యాంకు ఐమొబైల్‌, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్‌+, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు చెందిన అభయ్‌, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్‌, ఐడీబీఐ బ్యాంకు ఎంపాస్‌బుక్‌, బరోడా ఎంపాస్‌బుక్‌, యూనియన్‌ బ్యాంకు మొబైల్‌ బ్యాంకింగ్‌, యూనియన్‌ బ్యాంకు కమర్షియల్‌ క్లయింట్స్‌ ఉన్నాయి.  ఈ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడుతున్న కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు.

థర్డ్‌పార్టీ స్టోర్ల ఫేక్‌ ఫ్లాష్‌ ప్లేయర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ9480 మాల్‌వేర్‌ విజృంభిస్తుందని క్విక్‌ హీల్‌ రిపోర్టు చేసింది. సైబర్‌క్రిమినల్స్‌కు ఫ్లాష్‌ ప్లేయర్‌ యాప్‌ చాలా పాపులర్‌ టార్గెట్‌. ఒక్కసారి యూజర్లు ఈ హానికర అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేస్తే, కనిపించని ఐకాన్‌ యూజర్ల  స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేస్తుంది. అది టార్గెట్‌ చేసిన 232 బ్యాంకింగ్‌ యాప్స్‌కు సంబంధించి ఏ ఒక్క యాప్‌ను యూజర్లు చెక్‌ చేసుకున్నా.. ఆ హానికర యాప్‌ బ్యాంక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ యూజర్ల డేటాను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కీలక డేటాను దొంగలిస్తుందని క్విక్‌ హీల్‌ రిపోర్టు చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top