ఫార్మా రంగంలోకి అమెజాన్‌..

Amazon To Tie Up With Pharma Startup - Sakshi

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌తో నాటిలస్‌ బయోటెక్నాలజీ అనే ప్రముఖ స్టార్టప్‌ ఫార్మా కంపెనీ జతకట్టనుంది. ఈ కంపెనీ మొదటగా 2016లో అంకుర పరిశ్రమగా ప్రారంభమయ్యి ప్రస్తుతం దిగ్గజ కంపెనీల జాబితాలో నిలిచింది. రోగుల ప్రొటీన్‌ను మ్యాపింగ్‌ చేసి విశ్లేషించడమే కంపెనీ ముఖ్య లక్ష్యమని సహ వ్యవస్థాపకుడు సుజల్‌ పటేల్‌ పేర్కొన్నారు.

రోగుల ప్రొటీలన్‌లను మ్యాపింగ్‌ చేయడం వల్ల క్యాన్సర్‌ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించవచ్చని కంపెనీ పేర్కొంది. వైద్యులకు చికిత్స అందించేందుకు, మందుల తయారీకి.. ప్రొటిన్‌ మ్యాపింగ్‌, రక్తనమూనాలను విశ్లేషించడం ఎంతో కీలకమని కంపెనీ ముఖ్య ప్రతినిథులు అభిప్రాయపడ్డారు. మరోవైపు సరికొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌ల వల్ల ఫార్మా రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top