అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో ఆఫర్ల వెల్లువ | Amazon Summer Sale Starts Tomaro | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో ఆఫర్ల వెల్లువ

May 3 2019 8:13 AM | Updated on May 3 2019 8:13 AM

Amazon Summer Sale Starts Tomaro - Sakshi

రేపటి నుంచి అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 4 నుంచి 7 వరకూ నాలుగు రోజులు పాటు సాగే అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో భారీ ఆఫర్లతో రికార్డ్‌ సేల్స్‌ నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం సంసిద్ధమైంది. ప్రైమ్‌ మెంబర్లకు మే 3న మధ్యాహ్నం 12 గంటలకు ఎర్లీ ప్రివ్యూ ఆఫర్‌ చేస్తోంది. సమ్మర్‌ సేల్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే కస్టమర్లకు రూ 5 లక్షల విలువైన బహుమతులు ప్రకటించింది. ఇక పలు ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లను కస్టమర్ల ముందుంచింది. మరికొన్ని వారాల్లో ఒన్‌ప్లస్‌ 7, ఒన్‌ప్లస్‌ 7 ప్రొ లాంఛ్‌ కానున్న క్రమంలో ఒన్‌ప్లస్‌ 6టీ మోడల్స్‌ సేల్స్‌ను త్వరితగతిన పెంచుకునేందుకు భారీ తగ్గింపులను ఆఫర్‌ చేస్తోంది.

గత ఏడాది రూ 37,999తో భారత్‌లో లాంఛ్‌ అయిన ఒన్‌ప్లస్‌ 6టీపై అమెజాన్‌ ఇప్పటికే రూ 3000 డిస్కౌంట్‌ను ప్రకటించగా, సమ్మర్‌ సేల్‌లో లోయెస్ట్‌ ప్రైస్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇక 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌తో రూ 41,999తో లాంఛ్‌ చేసిన ప్రోడక్ట్‌ను రూ 32,999కే ఆఫర్‌ చేస్తోంది. రూ 10,990తో లాంఛ్‌ చేసిన సాంసంగ్‌ గెలాక్సీ ఎం 20ను సమ్మర్‌సేల్‌లో రూ 9,990కు ఆఫర్‌ చేస్తోంది. రూ 71,000తో లాంఛ్‌ అయిన గెలాక్సీ ఎస్‌10ను సేల్‌లో రూ 61,900కు ఆఫర్‌ చేస్తోంది. ఇలా పలు మోడళ్లు, ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో సమ్మర్‌ సేల్‌లో రికార్డు సేల్స్‌పై అమెజాన్‌ దృష్టిసారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement