అలహాబాద్‌ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గింపు | Allahabad Bank Cuts Lending Rates By 45 Basis Points | Sakshi
Sakshi News home page

అలహాబాద్‌ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గింపు

Mar 31 2018 7:26 PM | Updated on Mar 31 2018 7:26 PM

Allahabad Bank Cuts Lending Rates By 45 Basis Points - Sakshi

న్యూఢిల్లీ : ​ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్‌ బ్యాంకు రుణ వడ్డీరేట్లపై గుడ్‌న్యూస్‌ చెప్పింది. బేస్‌ రేటును, బెంచ్‌మార్కు ప్రైమ్‌ లెండింగ్‌ రేటు(బీపీఎల్‌ఆర్‌)ను 45 బేసిస్‌ పాయింట్లు చొప్పున తగ్గిస్తున్నట్టు అలహాబాద్‌ బ్యాంకు పేర్కొంది. దీంతో తక్కువ ఈఎంఐలకు రుణాలకు లభించనున్నాయి. తగ్గింపు నిర్ణయంతో బేస్‌ రేటు 9.60 శాతం నుంచి 9.15 శాతానికి దిగొచ్చింది.

బెంచ్‌మార్కు ప్రైమ్‌ లెండింగ్‌ రేటు కూడా 13.85 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. బేస్‌ రేటును, బీపీఎల్‌ఆర్‌ను 45 బేసిస్‌ పాయింట్లు చొప్పున తగ్గించాలని బ్యాంకు అసెట్‌ లైబిలిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ నిర్ణయించిందని బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సమీక్షించిన రేట్లు ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement