ఘనంగా ఆకాశ్‌, శ్లోకా వివాహం

Akash Ambani Ties The Knot With Shloka Mehta - Sakshi

ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ  పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్‌ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది.  అంగరంగా వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ  ప్రముఖులు సైతం హాజరయ్యారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

తొలుత ముఖేశ్‌, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్‌ అంబానీ .. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి  పూల మాలవేసి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం జరిగిన భరాత్‌లో ముఖేశ్‌ భార్య నీతాతో పాటు బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌, కాంగ్రెస్‌ నాయకుడు రాజీవ్‌ శుక్లాలు సందడి చేశారు. రాత్రి 8.15 గంటల తర్వాత వివాహ కార్యక్రమం మొదలైనట్టుగా తెలుస్తోంది.

ఈ వేడుకల్లో ఐక్యరాజ్యసమతి  మాజీ  ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ దంపతులు,  బ్రిటన్‌ మాజీ అధ్యక్షుడు టోనీబ్లేయర్ దంపతులు, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచ్చాయ్‌ దంపతులు  ప్రధాన ఆకర్షణగా నిలిచారు.  ఇంకా ఈ వేడుకల్లో రజనీకాంత్‌, ప్రియాంక్‌ చోప్రా, ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌, అమితాబ్‌, అమీర్‌ ఖాన్‌ , రతన్‌ టాటా, సచిన్‌, టైగర్‌ ష్రాప్‌, దిశా పటాని, కియరా అద్వానీ, జాన్వీ కపూర్‌, విద్యాబాలన్‌, అలియా భట్‌,  పాండ్యా సోదరులు, యువరాజ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, గతేడాది ముఖేశ్‌ కుతూరు ఇషా అంబానీ వివాహం ఆనంద్‌ పిరమల్‌తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top