హెచ్ డీఎఫ్ సీ ఖాతాదారులకు ఎయిర్ ఏషియా ఆఫర్ | Airasia teams with HDFC Bank, offers promo fares | Sakshi
Sakshi News home page

హెచ్ డీఎఫ్ సీ ఖాతాదారులకు ఎయిర్ ఏషియా ఆఫర్

Feb 9 2016 1:52 AM | Updated on Aug 14 2018 4:01 PM

హెచ్ డీఎఫ్ సీ ఖాతాదారులకు ఎయిర్ ఏషియా ఆఫర్ - Sakshi

హెచ్ డీఎఫ్ సీ ఖాతాదారులకు ఎయిర్ ఏషియా ఆఫర్

ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు విమాన ప్రయాణ చార్జీల్లో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.

హైదరాబాద్: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు విమాన ప్రయాణ చార్జీల్లో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు బేస్‌ధరలో 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నామని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 21వరకూ జరిగే బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఈ ఏడాది జూలై 1 నుంచి 30 సెప్టెంబర్ వరకూ ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ, ఎండీ మిట్టు చాండిల్య పేర్కొన్నారు. ఏయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఏషియా బెర్హాద్, ఎయిర్ ఏషియా ఎక్స్, థాయ్ ఎయిర్ ఏషియా విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. అందరికీ విమానయానం తమ లక్ష్యమని, అందుకు ఈ ఆఫర్లనిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement