బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత | Gold Mutual Funds Halt Fresh Investments HDFC ICICI Prudential Kotak Others | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఇన్వెస్టర్లకు అలర్ట్‌: బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత

Oct 16 2026 3:03 PM | Updated on Oct 16 2026 3:29 PM

Gold Mutual Funds Halt Fresh Investments HDFC ICICI Prudential Kotak Others

బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు తాత్కాలికంగా పరిమితులు ఎదురుకానున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) పథకాల్లో కొత్త పెట్టుబడులను అక్టోబర్‌ 16 నుంచి నిలిపివేస్తున్నట్లు పలు ఫండ్‌ హౌస్‌లు ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, కోటక్‌ మహీంద్రా, టాటా, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ ఆంక్షల పరిధి పథకాన్ని బట్టి మారుతుంది. కొత్త ఏకమొత్తం పెట్టుబడులు, ఎస్‌ఐపీ రిజిస్ట్రేషన్లు, అదనపు పెట్టుబడులు, స్విచ్‌-ఇన్లు, ఎస్‌టీపీలపై పరిమితులు ఉండవచ్చు. అయితే, ఇప్పటికే కొనసాగుతున్న ఎస్‌ఐపీలు, ఎస్‌టీపీ వాయిదాలకు సాధారణంగా అనుమతి ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణలు (రిడంప్షన్లు), స్విచ్‌-అవుట్లకూ అవకాశం ఉంటుంది. సంబంధిత ఫండ్‌ హౌస్‌ నోటీసులోని నిబంధనలను ఇన్వెస్టర్లు పరిశీలించాలి.

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బంగారానికి డిమాండ్‌ పెరిగే అవకాశమున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బంగారం దిగుమతులు పెరిగితే దేశ వాణిజ్య సమతుల్యత, రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఆగస్టులో 2.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత్‌ బంగారం దిగుమతులు సెప్టెంబర్‌లో 1.8 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్లు రాయిటర్స్‌ నివేదించింది.

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీతో చర్చల అనంతరం బల్క్‌ సబ్‌స్క్రిప్షన్ల నిలిపివేత జరిగిందని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ పేర్కొంది. అయితే, ఈ ఆంక్షలపై సెబీ అధికారిక ప్రకటన వెలువడలేదు. తదుపరి నోటీసులు వచ్చే వరకు పరిమితులు కొనసాగనున్నాయి.

ఇదీ చదవండి: రియల్‌ ఎస్టేట్‌లోకి మరో బడా కంపెనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement