breaking news
Gold sip scheme
-
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు తాత్కాలికంగా పరిమితులు ఎదురుకానున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) పథకాల్లో కొత్త పెట్టుబడులను అక్టోబర్ 16 నుంచి నిలిపివేస్తున్నట్లు పలు ఫండ్ హౌస్లు ప్రకటించాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ మహీంద్రా, టాటా, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.ఈ ఆంక్షల పరిధి పథకాన్ని బట్టి మారుతుంది. కొత్త ఏకమొత్తం పెట్టుబడులు, ఎస్ఐపీ రిజిస్ట్రేషన్లు, అదనపు పెట్టుబడులు, స్విచ్-ఇన్లు, ఎస్టీపీలపై పరిమితులు ఉండవచ్చు. అయితే, ఇప్పటికే కొనసాగుతున్న ఎస్ఐపీలు, ఎస్టీపీ వాయిదాలకు సాధారణంగా అనుమతి ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణలు (రిడంప్షన్లు), స్విచ్-అవుట్లకూ అవకాశం ఉంటుంది. సంబంధిత ఫండ్ హౌస్ నోటీసులోని నిబంధనలను ఇన్వెస్టర్లు పరిశీలించాలి.దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశమున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బంగారం దిగుమతులు పెరిగితే దేశ వాణిజ్య సమతుల్యత, రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఆగస్టులో 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్ బంగారం దిగుమతులు సెప్టెంబర్లో 1.8 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు రాయిటర్స్ నివేదించింది.మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో చర్చల అనంతరం బల్క్ సబ్స్క్రిప్షన్ల నిలిపివేత జరిగిందని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. అయితే, ఈ ఆంక్షలపై సెబీ అధికారిక ప్రకటన వెలువడలేదు. తదుపరి నోటీసులు వచ్చే వరకు పరిమితులు కొనసాగనున్నాయి.ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్లోకి మరో బడా కంపెనీ -
సత్యయుగ్ నుంచి గోల్డ్ సిప్ పథకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాలీవుడ్ నటి శిల్పా షెట్టికి చెందిన సత్యయుగ్ గ్రూపు చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు రూ. 50ల బంగారాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా ‘మేరా గోల్డ్ ప్లాన్’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రోజుకు కనీసంగా రూ. 50 లేదా నెలకు రూ.1,000 చొప్పున బంగారాన్ని కొనుగోలు చేయొ చ్చు. ఈ పథకం వివరాలను తెలియచేయడానికి గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యయుగ్ సీఈవో రాజ్ కుంద్రా మాట్లాడుతూ టాప్ 5 బ్యాంకుల ధర కంటే తక్కువ రేటుకే బంగారాన్ని అందిస్తామని, ఇందులో ఎటువంటి అదనపు రుసుములు ఉండవన్నారు. అలాగే బంగారాన్ని భద్రపర్చడానికి ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని తీసుకోవడం లేదా అమ్ముకోవడం చేయొచ్చన్నారు. రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ పథకానికి ఆదరణ బాగుందని, ఈ ఏడాది రెండు లక్షల మంది ఖాతాదారులకు రూ. 400 కోట్ల విలువైన బంగారాన్ని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సొంతగా ఏడు ఔట్లెట్లు ఉన్నాయని, వచ్చే 18 నెలల్లో హైదరాబాద్తో సహా అదనంగా 22 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది నెలవారీ వాయిదాల చెల్లింపుతో బంగారం కొనుగోలుచేసేందుకు ఉద్దేశించిన సేవింగ్స్ పథకాల్లోకి రాదని, దీంతో దీనికి ఆర్బీఐ నిబంధనలు, కొత్త కంపెనీల చట్టం నిబంధనలు వర్తించవన్నారు. గోల్డ్ సేవింగ్స్ పథకాల్ని ఇటీవల ఆర్బీఐ నిషేధించడం తెలిసిందే.


