ఏయిర్ ఏసియా మెగాసేల్: ఇంకా 3 రోజులే | AirAsia Mega Sale: Three Days Left To Avail Big Discounts | Sakshi
Sakshi News home page

ఏయిర్ ఏసియా మెగాసేల్: ఇంకా 3 రోజులే

Apr 7 2017 5:28 PM | Updated on Aug 14 2018 4:01 PM

ఏయిర్ ఏసియా మెగాసేల్: ఇంకా 3 రోజులే - Sakshi

ఏయిర్ ఏసియా మెగాసేల్: ఇంకా 3 రోజులే

ఏయిర్ ఏసియా ఇండియా మెగాసేల్ రూపంలో మరోసారి బంపర్ డిస్కౌంట్లకు తెరలేపింది.

ఏయిర్ ఏసియా ఇండియా మెగాసేల్ రూపంలో మరోసారి బంపర్ డిస్కౌంట్లకు తెరలేపింది. దేశీయ ప్రయాణాలకు, అంతర్జాతీయ ప్రయాణాలకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. అన్ని ధరలు కలుపుకుని దేశీయ ప్రయాణాలకు టిక్కెట్ ధర రూ.1,249 నుంచే ప్రారంభం కాబోతుందని, అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు రూ.1,999కే టిక్కెట్ విక్రయించనున్నట్టు ఏయిర్ ఏసియా తెలిపింది. ఈ ''మెగా సేల్ '' 2017 ఏప్రిల్ 9 వరకు అందుబాటులో ఉంచనున్నట్టు ఈ ఎయిర్ లైన్స్ పేర్కొంది.
 
గౌహతి-ఇంఫాల్(అన్ని ధరలు కలుపుకుని రూ.1249), బెంగళూరు-హైదరాబాద్(రూ.1,619), కోల్ కత్తా-రాంచి(రూ.2,249), బెంగళూరు-గోవా(రూ.1,719), న్యూఢిల్లీ-రాంచి(రూ.2,699) వంటి దేశీయ రూట్లను కవర్ చేయబోతున్నట్టు ఏయిర్ ఏసియా తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ సేల్ 2017 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాలకు వర్తించనుంది.
 
అదేవిధంగా విదేశీ విమానాలపై కూడా ఏయిర్ ఏసియా బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. భువనేశ్వర్-కౌలాలంపూర్(రూ.1,999), భువనేశ్వర్-ఫూకెట్(రూ.3,739), భువనేశ్వర్-పెనాంగ్(రూ.3,633) వంటి దక్షిణాసియా దేశాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది. సమ్మర్ హాలీడేస్ కోసం విహార యాత్రలకు వెళ్లే వారికోసం ఏయిర్ ఏసియా ఈ బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement