
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, టాటా గ్రూప్నకు చెందిన క్రోమా ఐఫోన్ 17 మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. క్రోమా స్టోర్స్, ట్రైబ్ అవుట్లెల్లు, క్రోమా.కామ్(ఆన్లైన్), టాటా న్యూ యాప్లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. లాంచ్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 19-27 వరకు సేల్ విండోతో ప్రారంభమవుతుంది. తరువాత అక్టోబర్ 26 వరకు కొన్ని ఎంపిక చేసిన ప్రయోజనాలతో ఆఫర్లు కొనసాగుతాయి.
క్రోమా, ట్రైబ్ స్టోర్లలో, అలాగే ఆన్లైన్లో(Croma.com)లో, టాటా న్యూ యాప్లో సెప్టెంబర్ 19-27 వరకు, కస్టమర్లు ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. టాటా న్యూ హెచ్డీఎఫ్సీ కార్డుతో 10% న్యూకాయిన్లను సంపాదించవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది. ఐఫోన్ కేస్లు, చార్జర్లు, ఆడియో గేర్ వంటి యాపిల్ యాక్సెసరీలపై 20 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఇది ప్రత్యేక ఆఫర్ గా, ఈ లాంచ్ సేల్ విండోలో మాత్రమే వర్తిస్తుంది.