ప్రైవేటీకరణ కాకపోతే ఎయిర్‌ఇండియా మూత | Air India will have to be closed if privatisation bid fails | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణ కాకపోతే ఎయిర్‌ఇండియా మూత

Nov 28 2019 6:04 AM | Updated on Nov 28 2019 6:04 AM

Air India will have to be closed if privatisation bid fails - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించకపోతే, మూసేయాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి బుధవారం రాజ్యసభకు తెలిపారు. సంస్థ ఉద్యోగులు అందరికీ సానుకూల ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎయిర్‌ ఇండియా తన ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, ప్రైవేటీకరించేంత వరకు ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తీసివేయడం జరగదని వివరించారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయంగా విమానాల రద్దీ తగ్గుముఖం పట్టినా, మన దేశంలో అంత ప్రతికూల పరిస్థితి లేదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement