పైలట్లకు ఎయిర్‌ ఇండియా షాక్‌

Air India has instructed its pilots to not order special meals - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్‌ ఎయిర్‌ ఇండియా పైలట్లకు షాక్‌ ఇచ్చింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ నిర్ధేశించిన ఆహార పదార్ధాలనే ఆర్డర్‌ చేయాలని, స్పెషల్‌ మీల్స్‌ను ఆర్డర్‌ చేయడం కుదరదని పైలట్లకు స్పష్టం చేసింది. సంస్థ నిర్దేశించిన మీల్స్‌ షెడ్యూల్‌కు భిన్నంగా విమాన సిబ్బంది స్పెషల్‌ మీల్స్‌ ఆర్డర్‌ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని..ఇది సంస్థ నిబంధనలకు విరుద్ధమని పైలట్లకు పంపిన ఈమెయిల్‌ సందేశంలో ఎయిర్‌ ఇండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఆరోగ్య కారణాలతో వైద్యుడి సిఫార్సుతో మాత్రమే సిబ్బంది స్పెషల్‌ మీల్స్‌ను ఆర్డర్‌ చేయవచ్చని వివరణ ఇచ్చారు. కాగా, పైలట్లు తమ కోసం బర్గర్లు, సూప్‌ల వంటి స్పెషల్‌ మీల్స్‌ను ఆర్డర్‌ చేసు​‍్తన్నట్టు వెల్ల్లడైందని, ఇది సంస్థ ఆహార వ్యయాల్లో పెరుగుదలతో పాటు ఆహార నిర్వహణ వ్యవస్థను డిస్టబ్‌ చేస్తోందని ఎయిర్‌ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top