ఈ ఆరు అటాక్స్‌ ప్రపంచాన్ని గడగడలాడించాయి..

6 brutal cyber attacks that shook the world in 2017 - Sakshi

డిజిటల్‌ ప్రపంచం.. ముందస్తు కంటే శరవేగంగా విస్తరిస్తున్న కొత్త లోకం. ఈ ప్రపంచం ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే స్పీడుగా దానిపై సైబర్‌ అటాక్స్‌ ​కూడా విజృంభిస్తున్నాయి. ఈ అటాక్స్‌ కొత్తమీ కాకపోయినా... వీటి సంఖ్య పెరగడం ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు సైబర్‌ అటాక్స్‌ విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా.. వీటి సంఖ్య పెరగడమే కానీ, తగ్గుముఖం పట్టడం లేదు. ప్రతి రోజు ఆన్‌లైన్‌లో దొంగలించే సమాచారం పెరిగిపోతోంది. ఈ ఏడాది ర్యామ్‌సమ్‌వేర్‌ అటాక్స్‌ వల్ల ఏర్పడిన నష్టం 5 బిలియన్‌ డాలర్ల(రూ.32,091 కోట్లకు పైన) పైగే ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఖర్చు తదుపరి ఏళ్లలో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా సైబర్‌ సెక్యురిటీ ఖర్చులు కూడా వచ్చే నాలుగేళ్లలో 1 ట్రిలియన్‌ డాలర్లకు పైన ఉంటుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2017లో ప్రపంచాన్ని వణికించిన ఆరు క్రూరమైన సైబర్‌ అటాక్స్‌ ఏమిటో ఓ సారి చూద్దాం..

షాడో బ్రోకర్స్‌....
షాడో బ్రోక‌ర్స్‌. ఇదో సైబ‌ర్ గ్యాంగ్‌. అమెరికా నిఘా సంస్థ ఎన్ఎస్ఏ నుంచి ఏప్రిల్ నెల‌లో ఈ షాడో బ్రోక‌ర్స్ ఓ సైబ‌ర్ ఆయుధాన్ని చోరీ చేశారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌ను వాడుకుని ఆ ఆయుధంతో ఎటువంటి కంప్యూట‌ర్‌ను అయినా హ్యాక్ చేయ‌వ‌చ్చు. వాస్త‌వానికి ఎట‌ర్న‌ల్ బ్లూ పేరుతో హ్యాకింగ్ ఆయుధాన్ని అమెరికా భ‌ద్రతా సంస్థ త‌యారు చేసింది. ఆ హ్యాకింగ్ టూల్‌నే షాడో బ్రోక‌ర్స్ ఎత్తుకెళ్లారు. ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన‌ బ‌గ్‌ను ఏప్రిల్ 14వ తేదీన షాడో గ్యాంగ్ కంప్యూట‌ర్ల‌పై వ‌దిలింది. దాంతో కంప్యూట‌ర్ సిస్ట‌మ్‌లు అన్నీ క‌ర‌ప్ట్ అయ్యాయి. షాడో బ్రోక‌ర్స్ అనేది ఓ ర‌హ‌స్య సంస్థ‌. వాళ్ల ఆచూకీ ఎక్క‌డా ఉండ‌దు.అయితే సిరియాపై అమెరికా బాంబు దాడి చేసినందుకే ఆ గ్యాంగ్ ఈ బ‌గ్‌తో కంప్యూట‌ర్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ గ్యాంగ్‌కు ర‌ష్యాతో సంబంధాలు ఉన్న‌ట్లు తెలిసింది. 

వాన్నక్రై....
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా వ్యాపించిన ర్యామ్‌సమ్‌వేర్‌ అటాక్స్‌లో వాన్నక్రై మాల్‌వేర్‌ ఒకటి. భారత్‌ సహా దాదాపు 100 దేశాలను ఈ వాన్నక్రై గడగడలాడించింది. కంప్యూటర్లలోని డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేసి, సొమ్ము చెల్లిస్తేగానీ దాన్ని విడిచిపెట్టబోమంటూ ప్రపంచాన్ని హడలెత్తిచింది. బాధిత దేశాల్లోని ఆసుపత్రులు, పోలీసు శాఖలు, ప్రజా రవాణా వ్యవస్థలు, టెలికం సంస్థలు, కంపెనీలు, యూనివర్సిటీలపై దీని ప్రభావం పడింది. ఈ తరహా సైబర్‌దాడిలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని నిపుణులు చెప్పారు. ఈ దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగానికి చెందిన 102 సిస్టమ్స్‌ కూడా ప్రభావితమయ్యాయి. 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్‌ వ్యవస్థలు ఈ వైరస్‌ బారిన పడినట్లు మాల్‌వేర్‌టెక్‌ ట్రాకర్‌ సంస్థ కనుగొంది.  మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థలో బలహీనతలను ఇది సొమ్ము చేసుకుంటోందని నిపుణులు చెప్పారు.

నాట్‌పెట్యా.....
ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపివేసిన మాల్‌వేర్‌లో నాట్‌పెట్యా ఒకటి. 2016 ర్యామ్‌సమ్‌వేర్‌ పెట్యాకు దీనికి చాలా పోలికలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంప్యూటర్లకు ఇది దాదాపు విస్తరించింది. అమెరికాలోని కార్పొరేట్‌ దిగ్గజాలు, ఫార్మాస్యూటికల్‌ కంపెనీ మెర్క్‌, డానిష్‌ షిప్పింగ్‌ కంపెనీ, రష్యన్‌ ఆయిల్‌ దిగ్గజం రోస్నేఫ్ట్ వంటివి దీని బారిన పడ్డాయి. ఉక్రేయిన్‌లో పవర్‌ కంపెనీలను, ఎయిరఫోర్టులను, పబ్లిక్‌ ట్రాన్సిస్ట్‌ను‌, ఈ దేశ సెంట్రల్‌ బ్యాంకును నాట్‌పెట్యా గడగడలాడించింది. ఆసియా-పసిఫిక్‌లో నాట్‌పెట్యాతో ఎక్కువగా ప్రభావితమైనది భారత్‌ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు దీని బారిన ఎక్కువగా పడ్డాయని సైబర్‌ సెక్యురిటీ సంస్థ సిమాంటెక్ పేర్కొంది.

 

జోమాటో హ్యాక్‌...
జోమాటో.. భారత్‌లోని అతిపెద్ద రెస్టారెంట్‌ అగ్రిగేటర్లలో ఒకటి. ఈ సంస్థ భారీ హ్యాకింగ్‌కు గురైంది. ఈ సంస్థకు చెందిన170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్ల సమాచారాన్ని హ్యాకర్లు డార్క్‌ వెబ్‌లో విక్రయించారు. ఈ డేటా బేస్ లో రిజిస్ట్రర్డ్ జోమాటో యూజర్ల ఈ-మెయిల్స్, పాస్ వర్డ్ లు ఉన్నాయి. దొంగలించిన డేటా జుమాటోకి చెందినదేనని నిరూపించడానికి నమూనా డేటాను కూడా ఆ విక్రయదారుడు షేర్ చేశాడు. దీంతో జోమాటో భద్రతా వైఫల్యాలతో తీవ్ర సతమతమైంది. అదృష్టశాత్తు యూజర్ల పేమెంట్‌ వివరాలు వేరే ప్రాంతంలో నిక్షిప్తం చేయడంతో, యూజర్లు ఆర్థిక నష్టం బారిన పడలేదు.

ది హెచ్‌బీఓ హ్యాక్‌...
గత దశాబ్దం కాలంగా స్క్రీన్లపై సంచలనం సృష్టిస్తున్న అ‍త్యంత పాపులర్‌ టెలివిజన్‌ షో 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'. దీనిపై కూడా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. ఈ షోకు చెందిన స్క్రీప్ట్‌లను, 1.5 టెర్రాబైట్స్‌ డేటాను ''మిస్టర్‌ స్మిత్‌'' అనే హ్యాకింగ్‌ గ్రూప్‌ దొంగతనం చేసింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి ఆరునెలల వేతనాన్ని డిమాండ్‌ చేశారు. అంటే 6 మిలియన్‌ డాలర్లకు పైగా వారు కోరారు. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఎక్కువ మొత్తంలో ఫైల్స్‌ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.  అయితే హ్యాకర్లు డిమాండ్‌ చేసిన మొత్తాన్ని హెచ్‌బీఓ చెల్లించిందో లేదో చెప్పడాన్ని మాత్రం ఆ సంస్థ చాలా సీక్రెట్‌గా ఉంచింది. 

ఈక్విఫ్యాక్స్‌...
అమెరికాలో అతిపెద్ద క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలో ఒకటి ఈక్విఫాక్స్. ఈ ఏడాది జూలైలో ఈ క్రెడిట్‌ ఏజెన్సీపై హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. 145 మిలియన్‌ ప్రజల వ్యక్తిగత డేటాను వీరు దొంగతనం చేశారు.  హ్యాకింగ్‌ బారిని పడిన అత్యంత చెత్త సంఘటనలో ఈక్విఫ్యాక్స్‌ దొంగతనం ఒకటి. కీలకమైన సమాచారం(క్రెడిట్‌ కార్డు నెంబర్లు, బర్త్‌డే వివరాలు, సోషల్‌ సెక్యురిటీ నెంబర్లు) హ్యాకర్లు దొంగలించారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top