ఎల్‌ఐసీ లక్ష్యం... 3 కోట్ల పాలసీ విక్రయాలు | 3 billion sales target of LIC Policy | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ లక్ష్యం... 3 కోట్ల పాలసీ విక్రయాలు

Jul 6 2015 2:07 AM | Updated on Sep 3 2017 4:57 AM

గత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రీమియం మార్కెట్ వాటా 70 శాతం దిగువకు చేరుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 కోట్ల

ముంబై : గత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రీమియం మార్కెట్ వాటా 70 శాతం దిగువకు చేరుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 కోట్ల పాలసీలను విక్రయించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ పాలసీల ప్రీమియం విలువ సుమారు రూ.31,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 31 శాతం (రూ.5,700 కోట్లు) వృద్ధిని కనబరిచామని ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్ తెలిపారు. పోటీదారులను ఎదుర్కోవడానికి ముఖ్యంగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, మార్కెట్ ఇంటర్మీడియరీస్ సంఖ్య పెంచుకోవడం, సామర్థ్యం, నైపుణ్యాల వృద్ధి, నిర్ణీత కాల సమీక్షల నిర్వహణ తదితర వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement