breaking news
economic year
-
లోన్స్‌కు డిమాండ్ రెట్టింపు!
ముంబై: బ్యాంకింగ్‌లో రుణ డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) 4 నుంచి 5 శాతం ఉండగా, ఈ శ్రేణి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) దాదాపు రెట్టింపై 9 నుంచి 10 శాతానికి చేరుతుందని భారత్ గణాంకాల విశ్లేషణ, రీసెర్చ్ అండ్ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనావేసింది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండెర్డ్ అండ్ పూర్స్‌కు అనుబంధంగా పనిచేస్తున్న క్రిసిల్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... కోవిడ్ ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న రెగ్యులేటరీ చర్యలు ఎకానమీ ఊహించిన దానికన్నా వేగంగా రికవరీ పట్టాలపైకి ఎక్కింది. 2021-22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు 0.8 శాతం క్షీణించింది. అయితే మూడవ త్రైమాసికంలో 3 శాతం (నెలవారీగా చూస్తే) వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో కూడా 3 శాతం వృద్ధి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 0 నుంచి 1 శాతం శ్రేణిలో బ్యాంకింగ్ రుణ వృద్ధి ఉంటుందని గత ఏడాది జూన్‌లో క్రిసిల్ అంచనా వేయడం గమనార్హం. తాజా నివేదికలో ఈ అంచనాలను గణనీయంగా (4 నుంచి 5 శాతం శ్రేణిలో) మెరుగుపరచింది. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి రూ.3 లక్షల కోట్ల విలువైన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వంటి ప్రభుత్వం ప్రకటిస్తున్న పలు ప్రోత్సాహకాలు రుణ డిమాండ్ పెరిగేందుకు దోహద పడుతుందని విశ్లేషించింది. ప్రైవేటు పెట్టుబడులు, ఎకానమీ రికవరీ వంటి అంశాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో రుణాల విషయంలో అటు రుణ గ్రహీతలు, ఇటు రుణ దాతలు జాగరూకత వహించారు. అయితే లాక్డౌన్ నిబంధనల సడలింపు పరిస్థితిని గణనీయంగా మార్చింది. పండుగల సీజన్ కూడా రుణ డిమాండ్‌కు గణనీయంగా దోహదపడింది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)కు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తగిన చర్యలు ఉంటున్నాయి. బ్యాంకింగ్ మొత్తంగా రుణాల్లో కార్పొరేట్ క్రెడిట్ వాటా 49 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ విభాగం రుణ డిమాండ్‌లో క్షీణతే నెలకొనే అవకాశం ఉంది. మూలధన పెట్టుబడులకు కంపెనీలు వెనుకాడుతుండడమే దీనికి కారణం. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ విభాగంలో 5 నుంచి 6 శాతం వృద్ధి రేటు నమోదయ్యే వీలుంది. తక్కువ స్థాయి బేస్‌తో పాటు, డిమాండ్ తిరిగి ఊపందుకోవడం దీనికి కారణం. రిటైల్ రుణ మంజూరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 నుంచి 10 శాతానికి తగ్గవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి ఈ విభాగం రెండంకెలకు పుంజుకుంటుంది. ఇక లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)లకు సంబంధించి మొత్తం రుణ వృద్ధి 9 నుంచి 10 శాతం ఉండే వీలుంది. అయితే అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కొనసాగించని పక్షంలో ఎంఎస్ఎంఈలకు రుణ వృద్ధి 2021–22లో తిరిగి 8 నుంచి 9 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా, వ్యవసాయ రంగానికి వచ్చే, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రుణ వృద్ధి రేటు 6 నుంచి 7 శాతం వరకూ ఉండే వీలుంది. భారత్ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ ఉన్నాయి. తగిన వర్షపాతం లేకపోవడం, కరోనా కేసుల పెరుగుదల ఇందుకు కారణం. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృత స్థాయిలో జరగడం కూడా కీలకం. రాష్ట్రాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 8.7 లక్షల కోట్లు లేదా వాటి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 4.7 శాతానికి చేరుతుంది. ఈ అంచనాలు నిజమైతే ద్రవ్యలోటు గణాంకాల విషయంలో ఇదే చరిత్రాత్మక గరిష్ట స్థాయి అవుతుంది. కరోనా ప్రేరిత అంశాల వల్ల పన్ను వసూళ్లు పడిపోవడం తాజా అంచనాలకు ప్రధాన కారణం. -
వృద్ధి రేటు 6.6 శాతమే..
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంతవ్సరం (2018 ఏప్రిల్ 2019 మార్చి) అక్టోబర్–డిసెంబర్ (మూడవ త్రైమాసికం) ఫలితాలు వెలువడ్డాయి. ఈ కాలంలో వృద్ధిరేటు కేవలం 6.6 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు త్రైమాసికాల్లో (15 నెలలు) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అయినా ఈ స్థాయి వృద్ధి రేటు ప్రపంచంలోని ఏ దేశంలోనూ నమోదుకాకపోవడం గమనార్హం. ఇదే మూడు నెలల్లో చైనా 6.4 శాతం వృద్ధితో రెండవ స్థానంలో ఉంది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటును సాధిస్తున్న దేశంగా భారత్ కొనసాగుతోంది. కాగా 2017–18 అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.7 శాతం. గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) గురువారం విడుదల చేసిన గణాంకాల ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే... ► చూస్తే, 2018–19 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.35 లక్షల కోట్లు. 2017–18 ఇదే నెలలో జీడీపీ విలువ రూ.32.85 లక్షల కోట్లు. అంటే వృద్ధి 6.6 శాతంగా ఉందన్నమాట. ► వ్యవసాయం, తయారీ రంగంవృద్ధి తగ్గడం, బలహీన వినియోగ డిమాండ్ మూడవ త్రైమాసికంలో వృద్ధి స్పీడ్‌ను తగ్గించాయి. ► మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలు ఇంతక్రితం 7.2 శాతంకాగా ఇప్పుడు 7 శాతానికి తగ్గించడం జరిగింది. ఇదే ఫలితం వెలువడితే, గడచిన ఐదు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి అవుతుంది. అయితే 7 శాతం స్థాయి వృద్ధి సాధించడానికి సైతం నాల్గవ త్రైమాసికంలో కనీనం 6.5 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. కాగా క్యూ4లో 6.5 శాతం వృద్ధి సాధనకు దేశ ఎగుమతుల్లో వృద్ధి కనీసం 14 శాతం ఉండాలని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకూ జరిగిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 8 శాతం అయితే, జూలై–సెప్టెంబర్ మధ్య ఈ రేటు 7 శాతంగా ఉంది. తొలి అంచనాలకన్నా (వరుసగా 8.2 శాతం, 7.1 శాతం) కేంద్ర గణాంకాల శాఖ ఈ వృద్ధి రేట్లను తగ్గించడం గమనార్హం. ► వినియోగ వ్యయం వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 8.4 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రేటు 9.9 శాతం. ► వ్యవసాయ రంగం వృద్ధి రేటు త్రైమాసికాల పరంగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం. క్యూ1లో వృద్ధి రేటు 4.6 శాతం అయితే, క్యూ2లో 4.2 శాతంగా ఉంది. ఇక క్యూ3లో భారీగా 2.7 శాతానికి పడిపోయింది. ► వార్షికంగా చూస్తే, మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. ► తయారీ రంగం వృద్ధి రేటు 8.6 శాతం నుంచి6.7 శాతానికి దిగింది. ► సీఎస్ఓ అంచనాల ప్రకారం, 2018–19లో వ్యవసాయ రంగం 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. 2017–18లో ఈ రేటు 5 శాతం. తయారీ రంగం వృద్ధి మాత్రం 5.9 శాతం నుంచి 8.1 శాతం వృద్ధి పెరిగే అవకాశం ఉంది. వాణిజ్యం, హోటెల్, రవాణా రంగాల వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గుతుంది. పెట్టుబడుల సూచీ స్థూల స్థిర మూలధన ఏర్పాటు (జీఎఫ్‌సీఎఫ్) రూ.48.97 లక్షల కోట్ల నుంచి రూ.55.02 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. తలసరి ఆదాయం రూ.92,718! కాగా ఈ ఆర్థిక సంవత్సరం(2018–19) మొత్తంగా తలసరి ఆదాయం (2017–18తో పోల్చిచూస్తే) రూ.87,623 నుంచి రూ.92,718 కోట్లకు పెరిగే అవకాశం ఉందని గణాంకాల శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 5.8 శాతానికి పెరగనున్నట్లు అంచనా. మౌలిక రంగం నిరాశ జనవరిలో కేవలం 1.8 శాతం వృద్ధి 19 నెలల కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ జనవరి వృద్ధి ధోరణి నిరాశ కలిగించింది. వృద్ధి రేటు కేవలం 1.8 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (6.2 శాతం వృద్ధి) పోల్చిచూస్తే, 2019 జనవరిలో ఎనిమిది పరిశ్రమల బాస్కెట్ వృద్ధి కేవలం 1.8 శాతంగా నమోదయ్యిందన్నమాట. గడచిన 19 నెలల్లో (2017 జూన్‌లో కేవలం 1 శాతం) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 డిసెంబర్లో కూడా ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.7 శాతంగా నమోదయ్యింది. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం గ్రూప్‌లో పరిశ్రమలను వేర్వేరుగా పరిశీలిస్తే... ► క్రూడ్ ఆయిల్ (–4.3 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.6 శాతం), విద్యుత్ (–0.4 శాతం) రంగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. 2013 ఫిబ్రవరి తరువాత విద్యుత్ రంగంలో ఇలాంటి ప్రతికూల స్థితి నెలకొనడం ఇదే తొలిసారని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొంది. ► బొగ్గు (1.7 శాతం), సిమెంట్ (11 శాతం) రంగాల స్పీడ్ తగ్గింది. 2018 జనవరిలో ఈ వృద్ధి రేట్లు వరుసగా 3.8 శాతం, 19.6 శాతంగా నమోదయ్యాయి. ► కాగా సహజవాయువులు (6.2 శాతం), ఎరువులు (10.5 శాతం), స్టీల్ (8.2 శాతం) మెరుగైన పురోగతిని నమోదుచేశాయి. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎమినిది రంగాల వాటా దాదాపు 41 శాతం. జనవరి ఐఐపీ గణాంకాలు మార్చి రెండవ వారంలో వెలువడనున్నాయి. ఎనిమిది పరిశ్రమల పేలవ పనితీరు మొత్తం జనవరి ఐఐపీ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా. ఏప్రిల్ నుంచి జనవరి వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి) జనవరి వరకూ చూస్తే, ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. -
ఎల్ఐసీ లక్ష్యం... 3 కోట్ల పాలసీ విక్రయాలు
ముంబై : గత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రీమియం మార్కెట్ వాటా 70 శాతం దిగువకు చేరుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 కోట్ల పాలసీలను విక్రయించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ పాలసీల ప్రీమియం విలువ సుమారు రూ.31,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 31 శాతం (రూ.5,700 కోట్లు) వృద్ధిని కనబరిచామని ఎల్ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్ తెలిపారు. పోటీదారులను ఎదుర్కోవడానికి ముఖ్యంగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, మార్కెట్ ఇంటర్మీడియరీస్ సంఖ్య పెంచుకోవడం, సామర్థ్యం, నైపుణ్యాల వృద్ధి, నిర్ణీత కాల సమీక్షల నిర్వహణ తదితర వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు.