రేంజ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ లాంచ్‌.. ధర ఎంత | Sakshi
Sakshi News home page

రేంజ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ లాంచ్‌.. ధర ఎంత

Published Thu, Jun 28 2018 7:49 PM

2018 Range Rover and Range Rover Sport launched in India   - Sakshi

సాక్షి,ముంబై:  టాటా  మోటార్స్‌  సొంతమైన  ల్యాండ్‌ రోవర్‌ ఇండియా  తన పాపులర్‌ వేరియంట్‌లో కొత్త  ఎస్‌యూవీలను లాంచ్‌ చేసింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జె.ఎల్.ఆర్.ఐ.ఐ.ఐ.ఐ)  తన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ 2018 మోడళ్లను విడుదల చేసింది.  బుధవారం వీటిని భారత మార్కెట్లో  లాంచ్‌ చేసింది.    

క్లామ్‌ షోల్‌ బోయినెట్‌, ఆల్‌ న్యూ ఫ్రంట్‌ గిల్లే , పిక్సెల్‌  లేజర్‌ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్‌ లాంటి అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌తో వీటిని లాంచ్‌ చేసింది. రేంజ్‌ రోవర్‌ డీజిల్ వేరియంట్‌  ప్రారంభ ధర 1.74కోట్ల  రూపాయిలు. గరిష్ట ధర 3.76కోట్లు, పెట్రోల్‌ వేరియంట్‌ ధర  రూ.1.87  కోట్ల నుంచి, రూ. 3.88కోట్ల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది.  రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌  డీజిల్‌ వేరియంట్‌ ప్రారంభ  ధర రూ .99.48 లక్షలు,   గరిష్ట ధర  రూ. 1.43 కోట్లుగా ఉంది. అదే  పెట్రోల్ వేరియంట్‌ ప్రారంభ ధర  1.1003 కోట్లు, గరిష్టంగా 1.96 కోట్లరూపాయలుగా ఉండనుంది. 2018 రేంజ్ రోవర్   మోడల్‌ ఎస్‌యూవీలు  గ్జరీ, సామర్ధ్యం, టెక్నాలజీలోని అందించడం లో ల్యాండ్‌ రోవర్‌   వారసత్వాన్ని  కొనసాగిస్తుందని,  కంపెనీ  ప్రెసిడెంట్ ,  మేనేజింగ్ డైరెక్టర్, రోహిత్ సూరి  తెలిపారు. ల్యాండ్ రోవర్ వాహనాలు భారతదేశంలో 27 అధికారిక కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి.


 

Advertisement
 
Advertisement
 
Advertisement