ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో మన వారు | 2 Indian-Origin Women In Forbes' Self-Made American Women List | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో మన వారు

Jun 3 2016 12:51 AM | Updated on Jun 4 2019 6:37 PM

ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో మన వారు - Sakshi

ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో మన వారు

ఫోర్బ్స్ రూపొందించిన ‘అమెరికా సంపన్న, విజయవంతమైన స్వయం స్వతహా మహిళా వ్యాపారవేత్తల’ వార్షిక జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు మహిళలు స్థానం పొందారు.

న్యూయార్క్: ఫోర్బ్స్ రూపొందించిన ‘అమెరికా సంపన్న, విజయవంతమైన స్వయం స్వతహా మహిళా వ్యాపారవేత్తల’ వార్షిక జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు మహిళలు స్థానం పొందారు. ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్‌సోర్సింగ్ సంస్థ సింథెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజ సేథి 16వ స్థానంలో నిలిచారు. ఈమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉలాల్ 30వ ర్యాంక్‌ను పొందారు. ఈమె నికర సంపద 470 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక జాబితా అగ్రస్థానంలో ఏబీసీ సప్లై అధినేత్రి డయాన్ హెన్‌డ్రి క్స్ ఉన్నారు. ఈమె నికర సంపద 4.9 బిలియన్ డాలర్లుగా ఉంది. జాబితాలో ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్, హెచ్‌పీ సీఈవో మెగ్ విత్‌మన్, డిజైనర్ టోరీ బర్చ్, సింగర్ మడోనా, యాహూ సీఈవో మరిస్సా మేయర్ వంటి తదితరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement