
ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ రిటైల్ చైన్ సంస్థ ‘సంగీత మొబైల్స్’.. అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండతో బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థుల మధ్య సంగీత మొబైల్స్, విజయ్ దేవరకొండ సంయుక్తంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ‘మన జీవితాల్లో మొబైల్ హ్యాండ్‌సెట్స్ చాలా కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు అన్ని విషయాలను జాగ్రత్తగా చూడాలి. ప్రస్తుతం చాలా మొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. అవి ఎలాంటి సేవలను అందిస్తున్నాయో గమనించండి. సంగీత మొబైల్స్ ప్రతినిధులు నన్ను కలిసిప్పుడు సంతోషపడ్డాను. వీళ్లు కస్టమర్లకు ఏం అవసరమో గుర్తించి వాటిని అందించేందుకు ప్రయత్నిస్తారు’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
గత 30 ఏళ్లుగా కస్టమర్లకు సేవలందిస్తున్నామని, ఇన్నోవేషన్ తమ బలమని సంగీత మొబైల్స్ తెలిపింది. ‘యంగ్ కస్టమర్లకు దగ్గర కావాలని అనుకున్నాం. మోడల్స్ వద్దనుకున్నాం. ఆ సమయంలో అందరికీ పరిచయమున్న వ్యక్తి అయితే బాగుంటుందని భావించాం. అప్పుడు విజయ్ దేవరకొండ గుర్తొచ్చారు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు. విశ్వసనీయత కలిగిన వ్యక్తి’ అని సంగీత మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. సంగీత మొబైల్స్‌కు విజయ్ దేవరకొండ రెండేళ్లపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ అన్ని ప్రింట్, ఔట్‌డోర్ అడ్వర్టైజింగ్‌లో ఈయన కనిపిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.