5.7 కోట్ల ఉబెర్‌ కస్టమర్ల డేటా చోరీ | Über 57 million customer data theft | Sakshi
Sakshi News home page

5.7 కోట్ల ఉబెర్‌ కస్టమర్ల డేటా చోరీ

Nov 23 2017 12:27 AM | Updated on Nov 23 2017 3:34 AM

Über 57 million customer data theft - Sakshi - Sakshi

న్యూయార్క్‌: పలు దేశాల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది ఉబెర్‌ కస్టమర్ల పేర్లు, ఈ మెయిల్‌ అడ్రెస్‌లు, ఫోన్‌ నంబర్లు మొదలైనవి హ్యాకింగ్‌కి గురవడం వెలుగులోకి వచ్చింది. అలాగే 6 లక్షలమంది అమెరికన్‌ డ్రైవర్ల లైసెన్సుల నంబర్లతో పాటు మొత్తం 70 లక్షల మంది డ్రైవర్ల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్లు వెల్లడైంది. అయితే, హ్యాకింగ్‌ గత సంవత్సరం అక్టోబర్‌లోనే జరిగినప్పటికీ.. కంపెనీ ఏడాదిపైగా ఈ విషయం బైటికి రాకుండా జాగ్రత్తపడింది.

తస్కరించిన డేటాను డిలీట్‌ చేసేందుకు, విషయం బైటికి తెలియకుండా చూసేందుకు హ్యాకర్లకు ఉబెర్‌ సుమారు 1,00,000 డాలర్లు కూడా చెల్లించింది. ఉబెర్‌ స్వయంగా ఈ విషయాలు వెల్లడించిన నేపథ్యంలో డేటా హ్యాకింగ్‌పై న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ విచారణ జరుపుతున్నారు. అయితే, డేటా దుర్వినియోగమేమీ జరగలేదని, ఇకపై ఇలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దారా ఖుస్రోవ్‌షాహీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement